హెయిర్ కలరింగ్ వల్ల జుట్టు అందంగా కనిపిస్తుంది. అయితే దానిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎలాంటి షాంపూ, కండీషనర్ వాడాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ప్రతీకాత్మక చిత్రం
ఈ రోజుల్లో హెయిర్ కలరింగ్ సర్వసాధారణం. ఎందుకంటే వయస్సు తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తెల్ల జుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు. తెల్ల జుట్టును కాస్త నల్ల జుట్టుగా మార్చుకునేందుకు మార్కెట్లో లభించే రకరకాల ఉత్పత్తులపై ఆధారపడుతున్నారు. అయితే జుట్టుకు డై వేస్తే జుట్టు మెరుస్తుంది.మీ అందాన్ని పెంచుతుంది. అయితే జుట్టుకు రంగు వేసే ముందు చాలా మంది కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి. అవేంటో చూద్దాం. మీరు ఏమాత్రం అజాగ్రత్త చేసినా, అది జుట్టు రంగును పాడు చేస్తుంది.జుట్టును కడగడం, నూనె రాసుకోవడం, కండిషనింగ్ కోసం వివిధ ఉత్పత్తులను ఉపయోగిస్తుండాలి. ఈ సమయంలో, కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
సల్ఫేట్ లేని షాంపూ వాడండి:
జుట్టుకు రంగు వేసిన తర్వాత, సోడియం లారిల్ సల్ఫేట్ ఉన్న షాంపూలను ఉపయోగించకూడదు. ఎందుకంటే ఈ రసాయనం జుట్టు రంగును దెబ్బతీస్తుంది. బదులుగా, హెయిర్-వాషింగ్ టెక్నిక్‌ని అనుసరించండి. జుట్టును షాంపూకి బదులుగా క్లెన్సర్ లేదా కండీషనర్‌తో మాత్రమే కడగాలి. ఇది జుట్టులో తేమను కూడా నిలుపుకుంటుంది. అలాగే జుట్టు పొడిబారదు.
ఎక్కువ బ్లో డ్రైయర్‌ని ఉపయోగించవద్దు:
బ్లో డ్రైయర్‌ని వీలైనంత తక్కువగా ఉపయోగించడానికి ప్రయత్నించండి. బ్లో డ్రైయర్‌ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల మీ జుట్టు పొడిగా ఉంటుంది.జుట్టు తేమ తగ్గుతుంది. మీరు బ్లో డ్రైయింగ్ వాడుతున్నప్పటికీ వాటిని దూరం నుంచి ఉపయోగించండి. కనీసం 5 సెంటీమీటర్ల దూరం ఉంచాలి. ఈ కారణంగా, వేడి జుట్టును పెద్దగా పాడు చేయదు.
డీప్ కండిషనింగ్:
జుట్టును హైడ్రేట్ చేయడానికి, మాయిశ్చరైజ్ చేయడానికి డీప్ కండిషనింగ్ ఫేస్ మాస్క్ ఉపయోగించండి. కనీసం వారానికి ఒకసారి ఈ మాస్క్ ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. షైన్ జుట్టులో ఉంటుంది.
ఈ విషయాలను కూడా గుర్తుంచుకోండి:
-సర్టిఫికేట్ పొందిన వ్యక్తి ద్వారా మాత్రమే హెయిర్ కలరింగ్ చేయించుకోండి. దీంతో ఎలాంటి ప్రమాదం ఉండదు.
- జుట్టు సంరక్షణను మర్చిపోవద్దు. ప్రతి రోజు జుట్టు సంరక్షణ కోసం సమయాన్ని కేటాయించాలి.
-నిపుణుల సలహా లేకుండా జుట్టుపై ఎలాంటి ఉత్పత్తిని ఉపయోగించవద్దు. లేకుంటే అది మీ జుట్టుకు హాని కలిగించవచ్చు.