చిన్నపిల్లల నుండి పెద్దవారి వారకు ఎంతో బలాన్ని, పోషకాలను అందిస్తాయి డ్రై ఫ్రూట్స్. కానీ రోజు ఒకే మాదిరి తినడం బోరు కొడుతూ ఉంటుంది కదా. అందుకే ఓసారి ఇలా డ్రైఫ్రూట్ లడ్డు ట్రై చేయాండి. అందరు ఇష్టంగా తింటారు. ఎలా తయరుచేసుకోవాలి, కావలసిన పదార్థాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతీకాత్మక చిత్రం

కావలసిన పదార్థాలు: 200 గ్రాముల ఖర్జూర, ఒక కప్పు బాదాం, అర కప్పు జీడి పప్పు, పావు కప్పు ఎండుద్రాక్ష, పావు కప్పు నువ్వులు, రెండు చెంచాలా గుమ్మడి విత్తనాలు, రెండు చెంచాల సన్ ఫ్లవర్ విత్తనాలు , రెండు చెంచాల పుచ్చకాయ విత్తనాలు, నెయ్యి
తయారు విధానం: ముందుగా 200 గ్రాముల ఖర్జూరాలను తీసుకొని లోపలి గింజను తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఒక కప్పు బాదాం పప్పుని, అర కప్పు జీడి పప్పుని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక పావు కప్పు ఎండుద్రాక్షను, పావు కప్పు నువులను తీసుకోవాలి. రెండు చెంచాలా గుమ్మడి విత్తనాలు, రెండు చెంచాల సన్ ఫ్లవర్ విత్తనాలు , రెండు చెంచాల పుచ్చకాయ విత్తనాలను తీసుకొని వాటిని కొంచెం దోరగా వేయించుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని రెండు మూడు చెంచాల వరకు నెయ్యిని వేసుకొని అందులో బాదాం, జీడి పప్పు, ఎండుద్రాక్ష వేసుకొని గల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసుకోవాలి. అదే ప్యాన్‌లో ఒక చెంచా నెయ్యి వేసి ఖర్జురాన్ని కూడా వేయించుకోవాలి. ఇప్పు్డు ఒక బౌల్‌లోకి వేయించి పెట్టుకున్న గుమ్మడి విత్తనాలు, సన్ ఫ్లవర్ విత్తనాలు, పుచ్చకాయ విత్తనాలను అలాగే బాదాం, జీడి పప్పు, ఎండుద్రాక్ష, ఖర్జురం వీటన్నింటిని మొత్తం కలిసేలా కలిపి లడ్డులుగా చేసుకోవటమే. ఎన్నో పోషకాలను అందించే డ్రైఫ్పూట్స్ లడ్డు రెడీ.