మన ఆరోగ్యానికి ఎన్నో పోషకాలను అంధించే డ్రై ప్రూట్ స్మూతి. దీన్ని కనీసం వారానికి ఒక్కసారైన తీసుకోవాలి. ఇందులో ఉండే విటమిన్స్ మీ జుట్టును ధృడంగా చేస్తయి. అలాగే మీ చర్మాన్ని మరింత అందంగా తయారు చేస్తుంది. బరువు పెరగడంలో కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అసలు దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, దీనికి కావలసిన పదార్థాలు ఏంటి తెలుసుకుందాం.
ప్రతీకాత్మక చిత్రం
మన ఆరోగ్యానికి ఎన్నో పోషకాలను అందించడంలో డ్రై ప్రూట్ స్మూతి తోడ్పడుతుంది. దీన్ని కనీసం వారానికి ఒక్కసారైనా తీసుకోవాలి. ఇందులో ఉండే విటమిన్స్ మీ జుట్టును ధృడంగా చేస్తాయి. అలాగే మీ చర్మాన్ని మరింత అందంగా తయారు చేస్తుంది. బరువు పెరగడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అసలు దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, దీనికి కావలసిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
గుమ్మడి విత్తనాలు, సన్‌ఫ్లవర్ విత్తనాలు, నువ్వులు, పల్లీలు, జీడిపప్పు, బాదం, అంజీర, కర్జూరం, పాలు
తయారు విధానం:
ఒక బౌల్‌లోకి ఒక స్పూన్ గుమ్మడి విత్తనాలను, ఒక స్పూన్ సన్ ఫ్లవర్ విత్తనాలను, ఒక స్పూన్ నువ్వులను తీసుకోవాలి. ఒక స్పూన్ పల్లీలు, ఒక స్పూన్ జీడిపప్పు పలుకులను బద్దలుగా చేసుకొని వేసుకోండి. ఒక నాలుగు బాదం పలుకులతో పాటు ఒక అంజీరను, ఒక కర్జూరాన్ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న బౌల్‌లో డ్రై ప్రూట్స్ మునిగే వరకు నీళ్లు పోయండి. మీరు ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లోకి తీసుకుంటే ముందురోజు రాత్రి నానబెట్టాలి. నైట్ డిన్నర్‌లోకి తీసుకుంటే పొద్దున నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన తర్వాత అందులోనే ఒక అరటిపండును కట్ చేసి వేసుకోవాలి. ఈ మిశ్రమం మొత్తం మిక్సీ జార్‌లోకి వేసుకొని ఒక కప్పు కాచి చల్లార్చిన పాలను వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక గ్లాస్‌లోకి తీసుకొని తాగటమే. ఇలా వారానికి రెండు, మూడు సార్లు తీసుకుంటే శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.