ప్రతిరోజు టీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. రోజులో కనీసం రెండు మూడు సార్లు అయినా టీ తాగుతుంటారు చాలామంది. ఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యేందుకు ఎక్కువమంది టీ తాగుతుంటారు. అయితే పాలతో తయారుచేసే టీకి బదులు లెమన్ టీ తాగడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు పలుకుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిమ్మలో ఉండే ఔషధ గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ప్రతిరోజు లెమన్ టీ తాగడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు పలుకుతాయి.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతిరోజు టీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. రోజులో కనీసం రెండు మూడు సార్లు అయినా టీ తాగుతుంటారు చాలామంది. ఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యేందుకు ఎక్కువమంది టీ తాగుతుంటారు. అయితే పాలతో తయారుచేసే టీకి బదులు లెమన్ టీ తాగడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు పలుకుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిమ్మలో ఉండే ఔషధ గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ప్రతిరోజు లెమన్ టీ తాగడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు పలుకుతాయి. బరువు తగ్గాలనుకునేవారు ఈ టి ప్రతిరోజు తాగితే మంచి ఫలితాలు పొందుతారు. లెమన్ టీ వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే ఒక్కరు కూడా విడిచిపెట్టకుండా దీనినే అలవాటు చేసుకుంటారు.
నీరు, నిమ్మరసం, తేనె, పుదీనాతో చేసే ఈ లెమన్ టీ ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మెదడును యాక్టివ్ చేస్తుంది. ఆందోళన, డిప్రెషన్, ఇతర మానసిక సమస్యలు కూడా తగ్గుతాయి. శరీర వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఉదయం లెమన్ టీ ఏదైనా తిన్న తర్వాత తాగితే మంచి ఫలితం ఉంటుంది. రోడ్గ నిరోధక శక్తి పెరుగుతుంది. మెటబాలిజం మెరుగుపడుతుంది. జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది. లెమన్ టీ ఉదయం పరగడుపున తాగవచ్చు. దీనివల్ల శరీరంలోని వ్యర్ధాలు, టాక్సిన్లు బయటకు పోతాయి. కాలేయానికి కూడా మేలు జరుగుతుంది. లెమన్ టీ తాగితే మైగ్రేన్ తగ్గుతుంది. జలుబు, దగ్గు సమస్యతో బాధపడుతుంటే ఈ టీ తాగడం వల్ల కాస్త ఉపశమనం లభిస్తుంది. అవకాశం ఉంటే టీ, కాఫీ తాగే కంటే లెమన్ టీ తాగడానికి ప్రయత్నించడం వల్ల మేలు కలుగుతుంది. లెమన్ టీ అలవాటుతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. శరీరంలో ఐరన్ లోపాన్ని నివారించడానికి పనిచేస్తుంది.
ఇది అధిక రక్తపోటు సమస్య నుండి నివారిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కడుపు ఉబ్బరం, మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం ఇస్తుంది. అంతేకాకుండా శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలో దోహదం చేస్తుంది. లెమన్ టీ లో అల్లం వేసి తయారు చేయడం వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. అల్లం వికారం సమస్యను అధిగమించేందుకు దోహదం చేస్తుంది. కండరాల నొప్పిని తగ్గిస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంచేందుకు ఇది ఉపయోగపడుతుంది. లెమన్ టీ లో క్యాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో క్రీమ్, చక్కెర ఉండదు. అందువల్ల ఇది వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మూత్రపిండాలు, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదం చేస్తుంది. కాబట్టి ప్రతిరోజు టీ, కాఫీ తాగే అలవాటు ఉన్నవారు వాటికి బదులుగా లెమన్ టీ అలవాటు చేసుకోవడం వల్ల మరింత ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.