Liver Detox Water: మీ లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఉదయాన్నే ఈ డ్రింక్స్ తాగండి

చాలా మంది జంక్ ఫుడ్ , ఆయిల్ ఫుడ్స్ తింటుంటారు. ఇలాంటి ఆహారం తిన్నప్పుడు లివర్ ఎప్పకటిప్పుడు క్లీన్ చేస్తుంది. అయితే కాలేయం తన పనిచేయనట్లయితే..రోగాల బారినపడుతాం. అయితే ఇంట్లోనే డిటాక్స్ వాటర్ తాగితే కాలేయం క్లీన్ అవుతుంది. పొట్టలోని మురికి మొత్తం బయటకుపోతుంది. లివర్ హెల్త్ కోసం డిటాక్స్ వాటర్ ఎలా తయారు చేయాలో చూద్దాం

Liver Detox Water

ప్రతీకాత్మక చిత్రం 


వర్షాకాలంలో పొట్ట, చర్మ సంబంధిత సమస్యలు వేగంగా పెరుగుతాయి. ఈ సీజన్‌లో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. బయట తినడం, అతిగా జంక్ ఫుడ్ తినడం, ఆయిల్, స్పైసీ ఫుడ్ వంటివి మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి.దీంతో కాలేయం సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పేలవమైన జీవనశైలి వల్ల ఫ్యాటీ లివర్ సమస్య పెరుగుతుంది. దీని వల్ల కాలేయం మాత్రమే కాకుండా శరీరంలోని ఇతర భాగాలు కూడా ప్రభావితమవుతాయి. కాబట్టి, చెడు జీవనశైలి  దుష్ప్రభావాలను తగ్గించడానికి, కాలేయాన్ని ఎప్పటికప్పుడు డిటాక్స్ చేయడం చాలా ముఖ్యం. తద్వారా కాలేయ సంబంధిత సమస్యలు ఉండవు. కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. వర్షాకాలంలో కడుపునొప్పి, మలబద్ధకం, అజీర్ణం, కాలేయ సంబంధిత సమస్యలు గణనీయంగా పెరుగుతాయి. ఇది మీ కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. అటువంటి పరిస్థితిలో, మీరు ఇంట్లో తయారుచేసిన డిటాక్స్ నీటితో కాలేయాన్ని శుభ్రం చేయవచ్చు. కాలేయాన్ని క్లీన్ చేసే అంశాలు.. ఈ డిటాక్స్ నీరు ఎలా తయారవుతుందో తెలుసుకుందాం?

ఇలా తయారు చేయండి: 

ముందుగా మీరు 1 లీటరు శుభ్రమైన ఫిల్టర్ నీటిని తీసుకోవాలి. ఇప్పుడు ఈ నీటిలో 5 తులసి ఆకులు, 10 పుదీనా ఆకులు వేయండి. ఈ నీటిలో చిన్న చిన్న ఆకుపచ్చ యాపిల్ ముక్కలను వేయండి. ఇప్పుడు కడిగి అందులో 1 స్పూన్ చియా సీడ్స్ వేయాలి. ఇవన్నీ 1 గంట పాటు పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ నీటిని నెమ్మదిగా తాగుతూ ఉండండి. మీరు ప్రతిరోజూ త్రాగవచ్చు. మీకు కావాలంటే, మీరు ఈ డిటాక్స్ నీటిని వారానికి 2 రోజులు మాత్రమే ఉపయోగించవచ్చు.

డిటాక్స్ వాటర్, ప్రయోజనాలు:

-రోజూ డిటాక్స్ వాటర్ తీసుకుంటే మలబద్ధకం సమస్య దూరమవుతుంది.

-డిటాక్స్ వాటర్ తాగడం వల్ల మూత్రానికి సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. 

-కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారు తాగితే..పొట్టలోని మురికి తొలగిపోతుంది.

-ఈ వాటర్ ప్రతిరోజూ తాగితే..ఊబకాయం కూడా తగ్గుతుంది.

-డిటాక్స్ వాటర్ తాగితే చర్మం, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.  


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్