డ్రాగన్ ప్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది. గుండెను మెరుగు పర్చడంలో ఉపయోగపడుతుంది. డ్రాగన్ ఫ్రూట్లోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, కొవ్వు ఆమ్లాలు కొలెస్టాల్ స్థాయిలను తగ్గించడంలో సహయపడుతాయి.
డ్రాగన్ ఫ్రూట్
డ్రాగన్ ప్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది. గుండెను మెరుగు పర్చడంలో ఉపయోగపడుతుంది. డ్రాగన్ ఫ్రూట్లోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, కొవ్వు ఆమ్లాలు కొలెస్టాల్ స్థాయిలను తగ్గించడంలో సహయపడుతాయి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాలు తగ్గుతాయి. డ్రాగన్ ఫ్రూట్‌లో క్యాలరీలు తక్కువగా ఉన్నప్పటీకీ పోషకాలతో నిండిన పండు. ఈ పండు సర్వ సాధారంగా 60 నుండి 136 కేలరీలు కలిగి ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్లో 3 నుంగి 5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఫైబర్ మానవ శరీర జీర్ణక్రియకు సహయపడుతుంది. డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తికి, కొల్లాజెన్ ఉత్పత్తికి ముఖ్యమైనది. ఇది ఇనుమును కుడా కలిగి ఉంటుంది. మానవ ఆక్సిజన్ సరఫరాకు, కండరాలు, నరాల పనితీరుకు ఎంతగానో ఉపయెగపడుతుంది.
డ్రాగన్ ఫ్రూట్ ఉపయెగాలు:
డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచడంలో సహయపడుతుంది.
జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది.
గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది.
ఎముకలను బలంగా ఉంచుతుంది.
కంటి చూపును మెరుగుపరుస్తుంది.