తేనె చాలా మందికి ఇష్టం. పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. తేనె రుచి ఎలా ఉంటుందో అందులోని ఆరోగ్య ప్రయోజనాలు కూడా అలాగే ఉంటాయి. ఇందులోని ఔషధ గుణాలు మనల్ని రకరకాల వ్యాధుల నుంచి కాపాడి శరీరాన్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచుతాయి. బరువు తగ్గడంలో తేనె ప్రధాన పాత్ర పోషిస్తుంది.
ప్రతీకాత్మక చిత్రం

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, ఒక చెంచా తేనె కలిపి ఉదయం ఖాళీ కడుపుతో, రాత్రి పడుకునే ముందు తాగడం వల్ల బరువు తగ్గుతారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరంలో రక్తప్రసరణను చురుగ్గా ఉంచుతాయి. ఇది గుండెపోటు, పక్షవాతం, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల నుండి మనలను రక్షిస్తుంది. అధిక రక్తపోటుతో పాటు, శరీరంలోని చక్కెర స్థాయిని కూడా సమతుల్యం చేస్తుంది.
మధుమేహం ఉన్నవారు సాధారణంగా తీపి పదార్థాలు తినకూడదు. కానీ తేనె వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రక్తహీనత సమస్యతో బాధపడే వారికి తేనె ఎంతో మేలు చేస్తుంది. వారు తమ రోజువారీ ఆహారంలో ప్రతిరోజూ తినవచ్చు. చిన్న పిల్లలు ప్రధానంగా జలుబు, దగ్గు, కఫంతో బాధపడుతుంటే.. వారికి తేనె కలిపి పాలను తాగడం వల్ల వారికి ఉపశమనం కలుగుతుంది. మన శరీరంలో ఏదైనా భాగంలో గాయం లేదా కోత ఉంటే, ఆ ప్రదేశంపై తేనెను పూయవచ్చు. ఇది మన మెదడుకు పదును పెట్టి జ్ఞాపక శక్తిని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.