కొందరి దంతాలు పసుపు రంగులో మారి చూడడానికి ఇబ్బందిగా అనిపిస్తుంటాయి. కొన్నిసార్లు దంతాలు పూర్తిగా పసుపు రంగులోకి మారి దుర్వాసనను కూడా వెదజల్లుతుంటాయి. పసుపు రంగులో మారిన దంతాల సమస్యను పరిష్కరించేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమస్యకు విటమిన్ సి లోపమే కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. విటమిన్ సి లోపంతో బాధపడే వారిలో దంతాలు పసుపు రంగులో కనిపిస్తాయి. ఇటువంటి వారికి విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడేలా చేయవచ్చు. విటమిన్ సి అధికంగా ఉండే ఫలాలు తీసుకోవడం వల్ల దంతాలు రంగును నల్లగా మార్చుకునేందుకు అవకాశం ఉంది.
ప్రతీకాత్మక చిత్రం
కొందరి దంతాలు పసుపు రంగులో మారి చూడడానికి ఇబ్బందిగా అనిపిస్తుంటాయి. కొన్నిసార్లు దంతాలు పూర్తిగా పసుపు రంగులోకి మారి దుర్వాసనను కూడా వెదజల్లుతుంటాయి. పసుపు రంగులో మారిన దంతాల సమస్యను పరిష్కరించేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమస్యకు విటమిన్ సి లోపమే కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. విటమిన్ సి లోపంతో బాధపడే వారిలో దంతాలు పసుపు రంగులో కనిపిస్తాయి. ఇటువంటి వారికి విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడేలా చేయవచ్చు. విటమిన్ సి అధికంగా ఉండే ఫలాలు తీసుకోవడం వల్ల దంతాలు రంగును నల్లగా మార్చుకునేందుకు అవకాశం ఉంది. అలాగే యాపిల్ సైడర్ వెనిగర్ కూడా దంతాలపై మార్గాలను తొలగించేందుకు ఉపయోగపడుతుంది. మార్కెట్లో లభించే కొన్ని ప్రత్యేకమైన టూత్ పేస్టులు కూడా పసుపు రంగులో ఉండే దంతాలను తెల్లగా మార్చడంలో ఉపయోగపడతాయి. ఈ పేస్టులను కూడా దంత వైద్యుల సూచనల మేరకు వినియోగించడం చాలా మంచిది. అలాగే అల్లం ముక్కలను గ్రైండ్ చేసి.. దానికి ఉప్పు, నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని టూత్ బ్రష్ తో దంతాలపై రుద్దడం వల్ల ఫలితం ఉంటుంది. ఇది వేగంగా పసుపు రంగులోకి మారిన దంతాలను తెలుపుగా మార్చడంలో ఉపయోగపడతాయి. అదే సమయంలో కొబ్బరి నూనెను నోట్లో వేసుకొని పుక్కిలించడం వల్ల కూడా పసుపు రంగులో ఉన్న దంతాలు తెల్లగా మారతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు మూడు లేదా నాలుగు గంటల పాటు బ్లీచింగ్ జల్తో తయారుచేసిన ట్రైన్ దంతాలపై ధరించడం వల్ల కూడా పసుపు రంగులో ఉన్న దంతాలను తెలుపు రంగులోకి మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిగి ఉండే కొన్ని వైటనింగ్ రిన్స్ లు మార్కెట్లో లభిస్తాయి. వీటిని కూడా దంతాలపై పెట్టుకోవడం ద్వారా పసుపు రంగును పోగట్టి తెల్లగా మార్చేందుకు ఉపయోగపడతాయి. రెండు వారాలపాటు బేకింగ్ సోడాతో పళ్ళు తోముకుంటే ఫలితం ఉంటుంది. ఈ సమస్య వేగంగా క్లియర్ చేయడంలో ఈ పద్ధతి ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
అందరిలోనూ ఈ సమస్య
పసుపు రంగులోకి దంతాలు మారడం అనే సమస్య అన్ని వయసుల వారిలోనూ కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. చిన్నారులు, వృద్ధులు, మహిళల్లోనూ ఈ సమస్య అధికంగా కనిపిస్తోంది. విటమిన్ సి లోపించడం వల్ల ఎక్కువమందిలో ఈ సమస్య కనిపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి పైన పేర్కొన్న పద్ధతులను పాటించడం వల్ల మెరుగైన ఫలితాలను పొందవచ్చని పేర్కొంటున్నారు. క్రమం తప్పకుండా ఈ పద్ధతులను పాటించడం ద్వారా కొద్ది రోజుల్లోనే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. పసుపు రంగులో మారిన దంతాలు కొద్ది రోజుల్లోనే తెలుపు రంగును సొంతం చేసుకుని నిగనిగల ఆడుతాయని చెబుతున్నారు. మరి ఆలస్యం ఎందుకు ఈ చిట్కాల్లో ఏదో ఒకదానిని ఫాలో అవ్వడం ద్వారా మీ పళ్ళను నిగనిగలాడే తెలుపు రంగును సొంతం చేసుకోండి.