ఈ సమస్యలు వేధిస్తున్నాయా.. మీరు విటమిన్ల లోపంతో బాధపడుతున్నట్టే.!

మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో వచ్చిన మార్పులు కారణంగా అనేకమందిలో అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల ఎక్కువమందిలో విటమిన్ల లోపం సమస్య అధికంగా కనిపిస్తోంది. విటమిన్ల లోపంతో బాధపడే వారిలో కొన్ని లక్షణాలను గుర్తించవచ్చు. ఆయా లక్షణాలు కనిపించిన వెంటనే అప్రమత్తం కావడం ద్వారా ఈ సమస్య నుంచి వేగంగా కోలుకునే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ల లోపం ఉన్నవారిలో ప్రధానంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ బి లోపిస్తే జుట్టు, గోర్లు సున్నితంగా మారిపోతాయి.

 symbolic image

ప్రతీకాత్మక చిత్రం

మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో వచ్చిన మార్పులు కారణంగా అనేకమందిలో అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల ఎక్కువమందిలో విటమిన్ల లోపం సమస్య అధికంగా కనిపిస్తోంది. విటమిన్ల లోపంతో బాధపడే వారిలో కొన్ని లక్షణాలను గుర్తించవచ్చు. ఆయా లక్షణాలు కనిపించిన వెంటనే అప్రమత్తం కావడం ద్వారా ఈ సమస్య నుంచి వేగంగా కోలుకునే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ల లోపం ఉన్నవారిలో ప్రధానంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ బి లోపిస్తే జుట్టు, గోర్లు సున్నితంగా మారిపోతాయి. శరీరానికి అవసరమైన స్థాయిలో విటమిన్ బి లభించకపోతే నోటిలో, నోటి చుట్టుపక్కల పుండ్లు, బొబ్బలు ఏర్పడతాయి. అలాగే గాయాలు తొందరగా నయం కాకపోయినా, చిగుళ్లలో రక్తస్రావం జరుగుతున్న విటమిన్ సి లోపం ఉందని అర్థం అర్థం చేసుకోవాలి. రాత్రి సమయాల్లో కంటిచూపు ఇబ్బందులు ఉంటే విటమిన్ ఏ లోపం ఉందని భావించాల్సి ఉంటుంది. ఆహారంలో జింక్, నియాసిన్ లోపిస్తే చుండ్రు, జుట్టులో పొలుసులు వంటి సమస్యలు వస్తాయి. శరీరంలో ఐరన్, జింక్ లోపిస్తే జుట్టు రాలే సమస్య అధికం అవుతుంది. ఎముకలు, కండరాలు బలహీనంగా ఉంటే శరీరంలో విటమిన్ డి లోపం ఉన్నట్టు గుర్తించాల్సి ఉంటుంది. 

ఈ లక్షణాలతో ఇబ్బంది..

శరీరంలో ఆయా విటమిన్ లోపిస్తే కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. నీరసంగా ఉండడం, వెన్నునొప్పి, మెడ నొప్పి, కాళ్ల కండరాల నొప్పులు వేధిస్తాయి. అలాగే, తీవ్రమైన అలసట, నిద్రలేమి వంటి ఇబ్బందులు విటమిన్ బి12, విటమిన్ డి లోపం వల్ల వేదిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటితోపాటు ఇతర లక్షణాలను గుర్తించి వెంటనే వైద్యుల సలహా మేరకు సప్లిమెంట్స్ వాడడం, కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. నిర్లక్ష్యం చేస్తే కొన్నిసార్లు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తగిన జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి కోలుకునే అవకాశం ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్