జీడిపప్పు తినడానికి చాలా రుచిగా ఉంటుంది.అయినప్పటికీ అతిగా తినడం ఆరోగ్యానికి హానికరం. ముఖ్యంగా ఈ సమస్యలు ఉన్నవారు జీడిపప్పు తినకూడదు. ఎందుకో తెలుసుకుందామా?
ప్రతీకాత్మక చిత్రం
జీడిపప్పు.. పోషకాలు అధికంగా ఉండే డ్రై ఫ్రూట్స్. చాలా మంది దీన్ని ఇష్టంగా తింటారు.స్వీట్లతోపాటు అనేక వంటకాల్లోనూ దీన్ని ఉపయోగిస్తారు. జీడిపప్పు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అయితే వీటిలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జీడిపప్పును తినకూడదు. జీడిపప్పును ఎలాంటి సమస్యలు ఉన్నవారు తినకూడదో తెలుసుకుందాం.
వ్యాధిని తీవ్రతరం చేస్తుంది:
జీడిపప్పు తీసుకోవడం వల్ల కొందరికి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నవారు, షుగర్ పేషంట్లు జీడిపప్పు తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు.కొన్ని వ్యాధులలో జీడిపప్పు తీసుకోవడం వల్ల వ్యాధి తీవ్రతరం అవుతుంది. కాబట్టి జీడిపప్పును ఎవరు తినకూడదో తెలుసుకుందాం.
అలర్జీ బాధితులు:
కొంతమందికి జీడిపప్పు అలర్జీ కలిగిస్తుంది. కాబట్టి అలాంటి అలర్జీతో బాధపడేవారు జీడిపప్పు తినకూడదు. లేకపోతే, చర్మంపై దద్దుర్లు, దురద సంభవించవచ్చు. వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు అనుభవించవచ్చు.
అధిక కొలెస్ట్రాల్ ప్రమాదం:
జీడిపప్పులో కొవ్వు ఉంటుంది. కాబట్టి అధిక వినియోగం కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. వేయించిన జీడిపప్పు లేదా మసాలా జీడిపప్పులు తింటే, వాటిలో ఉప్పు కూడా ఉంటుంది. అధిక రక్తపోటు ఉన్న రోగులకు ఇది హానికరం. అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు రెండూ గుండె రోగులకు ప్రమాదకరం.
మూత్రపిండ సమస్యలు:
కిడ్నీ సమస్యలతో బాధపడేవారు జీడిపప్పును తినకూడదు. ఇందులో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది కిడ్నీ రోగులకు హానికరం. చాలా పొటాషియం మూత్రపిండాల పనితీరుపై ఒత్తిడిని కలిగిస్తుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు:
జీడిపప్పులో కేలరీలు, కొవ్వు రెండూ ఎక్కువగా ఉంటాయి. ఇది డయాబెటిక్ రోగులకు హానికరం. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు జీడిపప్పు తినకూడదు. ఇది మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.