రోజుకు ఎన్ని కప్పుల టీ తాగాలో తెలుసా.. పరిధి దాటితే ఈ సమస్యలు తప్పవు.!

ఒకప్పుడు టీ తాగే అలవాటు అతి కొద్ది మందికి మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఉరుకుల, పరుగుల జీవితాలతో.. వేలాపాలలేని ఉద్యోగాలతో టి తప్పక తాగాల్సిన పరిస్థితి ఎంతోమందికి ఏర్పడింది. టీ తాగడాన్ని చాలామంది ఒత్తిడి నుంచి రిలాక్సేషన్ గా భావిస్తారు. అయితే, ఈరోజుకి ఎన్ని కప్పులు తాగాలి అన్నదానిపైన ఒక నిబంధన ఉంది. చాలామంది రోజులో ఎన్నిసార్లు టీ తాగుతారు లెక్కించరు కూడా. ఇలా లెక్క లేకుండా తాగే టీ కప్పుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీ తాగే అలవాటు తప్పేమీ కాదు. కానీ దాని పరిమాణాన్ని నియంత్రంచడం కూడా ముఖ్యం.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

ఒకప్పుడు టీ తాగే అలవాటు అతి కొద్ది మందికి మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఉరుకుల, పరుగుల జీవితాలతో.. వేలాపాలలేని ఉద్యోగాలతో టి తప్పక తాగాల్సిన పరిస్థితి ఎంతోమందికి ఏర్పడింది. టీ తాగడాన్ని చాలామంది ఒత్తిడి నుంచి రిలాక్సేషన్ గా భావిస్తారు. అయితే, ఈరోజుకి ఎన్ని కప్పులు తాగాలి అన్నదానిపైన ఒక నిబంధన ఉంది. చాలామంది రోజులో ఎన్నిసార్లు టీ తాగుతారు లెక్కించరు కూడా. ఇలా లెక్క లేకుండా తాగే టీ కప్పుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీ తాగే అలవాటు తప్పేమీ కాదు. కానీ దాని పరిమాణాన్ని నియంత్రంచడం కూడా ముఖ్యం. టీ తాగడం కూడా ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అనే నిపుణులు చెబుతున్నారు. టీ అలవాటు మానుకోలేని వారు రోజుకు ఎన్ని కప్పుల టీ తాగొచ్చు అనేది తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. పరిధికి మించి టీ తాగడం వల్ల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని హెచ్చరిస్తున్నారు. 

రోజులో ఎక్కువ కప్పుల టీ తాగడం వల్ల అనేక ఇబ్బందులు ఉత్పన్నమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నాడు. ముఖ్యంగా ఎక్కువ కప్పులు టీ తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. ఇది నిద్ర సమస్యలను కూడా పెంచుతుంది. టీ లో అధికంగా ఉండే కెఫిన్ ఆందోళన, నిద్రలేమి, ఒత్తిడికి కారణం అవుతుంది. ఇవి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి కూడా. టీ లో ఉండే టానిన్లు దంత సమస్యలను కలిగిస్తాయి. టీ ఎక్కువగా తాగడం వల్ల దంతాలు త్వరగా పాడవుతాయి. టి అధికంగా తాగడం వల్ల గ్యాస్ సంబంధిత సమస్యలు, కడుపునొప్పి, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఈ తరహా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ అలవాటు మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. టి ఆకుల్లో క్యాలరీలు ఉండవు. గ్రీన్ టీ, బ్లాక్టీలను వేడి నీళ్లలో కలిపితే తక్కువ మొత్తంలో క్యాలరీలు ఉత్పత్తి అవుతాయి. 250 ఎంఎల్ టీలో కూడా మూడు క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఇందుకు బదులుగా టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. టీలో పాలు కలిపినప్పుడే దాని క్యాలరీ కంటెంట్ పెరుగుతుంది. పాలతో టీ తాగే అలవాటు బరువును పెంచుతుంది. పాలతో కలిపిన టీ తాగడం వల్ల క్యాలరీ కంటెంట్ ఐదు నుంచి 30 క్యాలరీలకు పెరుగుతుంది. ఇది బరువు పెరగడానికి కారణం అవుతుంది. బరువు తగ్గాలనుకుంటే పాలతో చేసిన టీకి బదులుగా ఇతర మార్గాలను ఎంచుకోవడం అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు. పాలు, పంచదార కలిపి తయారుచేసిన టీ తాగడం వల్ల ఆరోగ్యకరమైన అలవాటు కాదంటున్నారు నిపుణులు. బరువు తగ్గాలనుకునేవారు తప్పనిసరిగా పాలతో చేసే టీకి దూరంగా ఉండాలి. గ్రీన్ టీ, బ్లాక్ టీ అలవాటు చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజు కప్పుల మీద కప్పులు టీ తాగే వాళ్లు అప్రమత్తం కావాలని, లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్