నేటికాలంలో చాలా మంది చిన్న వయస్సులోనే రకరకాల జబ్బుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్, అధికరక్తపోటు, ఊబకాయం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. అలాంటి వారు ప్రతిరోజూ ఈ ఆకులు నాలుగైదు తింటే చాలు అనేక అద్భుత ప్రయోజనాలను పొందవచ్చని చెబుతున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.
ప్రతీకాత్మక చిత్రం
హిందువుల ఇళ్లలో తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. తులసి దైవంగానే కాదు..ఆరోగ్యపరంగానూ ఎంతో మేలు చేస్తుంది. తులసి ఆకులను నమలడం వల్ల మీ మొత్తం ఆరోగ్యాన్ని చాలా వరకు మెరుగుపరుస్తుంది. తులసి ఆకుల అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసుకుంటే, మీరు వాటిని మీ రోజువారీ ఆహారంలో కూడా చేర్చుకుంటారు. తులసి ఆకులను ఆరోగ్యానికి వరం అని ఎందుకు పరిగణిస్తారో తెలుసుకుందాం.
ఆహారంలో ఎలా చేర్చుకోవాలి?
ప్రతిరోజూ ఉదయం నాలుగు నుంచి ఐదు తులసి ఆకులను నమలండి.ఇలా ఒక నెలపాటు ప్రతిరోజూ తినండి. మీలో ఆటోమెటిగ్గా మార్పులు వస్తాయి. తులసి ఆకులను తీసుకోవడం ద్వారా జలుబు, దగ్గు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్ల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. తులసి ఆకులు మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతో పాటు అనేక తీవ్రమైన, ప్రాణాంతక వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడతాయి.
ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు?
మీ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించాలనుకుంటే, తులసి ఆకులను నమలండ.అంతేకాదు తులసి ఆకులు మీ గుండె ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. తులసి ఆకులను క్రమం తప్పకుండా నమలడం ద్వారా, మీరు ప్రాణాంతక గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
తులసి ఆకులలో ఉండే మూలకాలు:
తులసి ఆకులలో మంచి మొత్తంలో విటమిన్ కె, పొటాషియం, జింక్, మెగ్నీషియం,యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, తులసి ఆకులలో ఉండే ఈ మూలకాలన్నీ మీ మొత్తం ఆరోగ్యాన్ని చాలా వరకు మెరుగుపరుస్తాయి.