బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని పూర్వీకులు చెప్పేవారు. అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఎప్పుడు.? ఈ సమయంలో లేవడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అన్నదానిపై చాలామందికి అవగాహన లేదు. బ్రహ్మ ముహూర్తంలో లేవడం వలన అనేక రకాల ప్రయోజనాలు శరీరానికి లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం 3:45 గంటల నుంచి 5.30 30 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో నిద్ర లేవడం శరీరానికి, మనసుకు, ఆధ్యాత్మిక అభివృద్ధికి ఎంతో మేలు చేస్తుందని పండితులు చెబుతున్నారు. బ్రహ్మ ముహూర్తంలో లేచి యోగ, ధ్యానం, ప్రాణాయామం వంటివి చేయడం వల్ల మెదడు శక్తిని పెంచుతుంది.
ప్రతీకాత్మక చిత్రం
బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని పూర్వీకులు చెప్పేవారు. అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఎప్పుడు.? ఈ సమయంలో లేవడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అన్నదానిపై చాలామందికి అవగాహన లేదు. బ్రహ్మ ముహూర్తంలో లేవడం వలన అనేక రకాల ప్రయోజనాలు శరీరానికి లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం 3:45 గంటల నుంచి 5.30 30 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో నిద్ర లేవడం శరీరానికి, మనసుకు, ఆధ్యాత్మిక అభివృద్ధికి ఎంతో మేలు చేస్తుందని పండితులు చెబుతున్నారు. బ్రహ్మ ముహూర్తంలో లేచి యోగ, ధ్యానం, ప్రాణాయామం వంటివి చేయడం వల్ల మెదడు శక్తిని పెంచుతుంది. సూర్యోదయపు కిరణాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని పండితులు పేర్కొంటున్నారు. కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో లేవడం వలన అనేక ప్రయోజనాలను పొందేందుకు అవకాశం ఉంటుంది.
బ్రహ్మ ముహూర్తంలో లేవడం చాలామందికి ఇబ్బందితో కూడిన వ్యవహారంగా మారింది. ఉరుకుల, పరుగుల జీవితాలతో చాలామంది అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రపోవడం, తెల్లవారి ఎనిమిది గంటల తర్వాత నిద్ర లేవడం అలవాటుగా మారిపోయింది. దీంతో బ్రహ్మ ముహూర్తం గురించి చాలామంది పట్టించుకోవడమే మానేశారు. సూర్యకిరణాలు ఒంటికి తగిలించుకునే వారి సంఖ్య భారీగానే తగ్గిపోయింది. ఈ నేపథ్యంలోనే అనేక వ్యాధుల బారినపడి ప్రజలు విరవిలాడుతున్నారు. ఇటువంటి సమస్యలకు చెక్ చెప్పేందుకు బ్రహ్మ ముహూర్తం ఒక ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. బ్రహ్మ ముహూర్త సమయంలో ఓజోన్ పొర భూమికి దగ్గరగా, వాతావరణంలో ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటుంది. ఓజోన్ పరలో అధిక మొత్తంలో ఆక్సిజన్ ఉంటుంది. ఇది మానవ శ్వాసక్ రేకు అత్యంత అవసరం. ఈ సమయంలో నిద్ర లేచి కుడి నాసికా అందరం ద్వారా లోతైన శ్వాస తీసుకుంటే రక్తంలో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. ఇది హిమోగ్లోబిన్ ను మెరుగుపరుస్తుంది. తద్వారా శరీరంలోని కణాలకు ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది. అదే సమయంలో అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. ఈ సమయంలో స్వచ్ఛమైన గాలిని పీల్చడం వల్ల శరీరం ఉత్తేజితమవుతుంది. అలాగే రాత్రిపూట శరీరంలో పేరుకుపోయిన విషయాన్ని 9 మార్గాల ద్వారా బయటకు పంపే ప్రక్రియ జరుగుతుంది. ఈ మార్గాలు రెండు కళ్ళు, రెండు నాసికా రంధ్రాలు, రెండు చెవులు, నోరు, జననాంగాలు, మల ద్వారం. ఈ టాక్సిన్స్ లో బ్యాక్టీరియా, వైరస్ వంటి హానికరమైన సూక్ష్మజీవులు ఉంటాయి.
ఇవి మనల్ని అనారోగ్యానికి గురిచేస్తాయి. సూర్య రష్మికి గురైనట్లయితే ఈ సూక్ష్మజీవులు మరింత ప్రమాదకరంగా మారతాయి. కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి శరీరం నుంచి విషయాన్ని బయటకు పంపడం చాలా ముఖ్యం అని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో శరీరం శుద్ధి అవుతుంది. బ్రహ్మ ముహూర్తంలో సూర్యోదయానికి ముందు చేసే స్నానం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ స్నానం వల్ల చర్మ రంధ్రాలు పూర్తిగా తెరుచుకుంటాయి. ఇది స్వచ్ఛమైన గాలిని గ్రహించి అన్ని అవయవాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. దీనివల్ల రోజంతా శరీరం తాజాగా శక్తివంతంగా ఉంటుంది. రోజంతా పనిచేసినప్పటికీ ఉత్సాహంగా ఉండడానికి దోహదం చేస్తుంది. ఈ సమయంలో మెదడులోని జ్ఞాపకశక్తి కేంద్రాలు, ఇతర ప్రాంతాలు సక్రీయం చేయబడతాయి. ఈ కాలంలో చదువుకుంటే ఇతర సమయాలతో పోలిస్తే సమాచారాన్ని బాగా గుర్తుంచుకుంటారు. అదనంగా ఈ సమయంలో ఓం మంత్రాన్ని జపించడం వల్ల జ్ఞాపకశక్తి కేంద్రాలు, మెదడులోని ఇతర శక్తివంతమైన ప్రాంతాలు ఉత్తేజితం అవుతాయి. ఏకాగ్రత కూడా పెరుగుతుంది.