మీకు PCOD ఉందా.. అయతే ఈ ఫుడ్‌తో జాగ్రత్త..

ఈ మధ్యకాలంలో ఆరోగ్య సమస్యలు చాలా మందిలో ఉన్నాయి. అందులో ముఖ్యంగా కొందరి ఆడవారిలో ఉండే సమస్య PCOD. టీనేజీ వాళ్లలో కూడా ఈ సమస్య రావడం ఎక్కువై పోయింది.

 PCOD FOOD

ప్రతీకాత్మక చిత్రం

ఈ మధ్యకాలంలో ఆరోగ్య సమస్యలు చాలా మందిలో ఉన్నాయి. అందులో ముఖ్యంగా కొందరి ఆడవారిలో ఉండే సమస్య PCOD. టీనేజీ వాళ్లలో కూడా ఈ సమస్య రావడం ఎక్కువై పోయింది. అలాగే ఎవరైతే పిల్లల కోసం ప్రయత్నిస్తున్నారో అలాంటి వారిలో మనం ఎక్కువగా చుస్తున్న సమస్య ఈ పీసీఓడీ. బయట జంక్ ఫుడ్ బాగా తినే వారిలో అంటే ఐస్‌క్రీమ్స్, పిజ్జా, బర్గర్ లాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక బరువు పెరిగి హర్మోన్లు ప్రభావితం అయ్యి ఈ సమస్య మొదలవుతుంది. దీనిని కంట్రోల్ చేయటానికి ఎక్సర్‌సైజ్, యోగాతో పాటు కొన్ని ఆహార పదార్థాలలో మార్పులు కూడా తీసుకోవాలి. ఎలాంటి ఆహారం తీసుకుంటే పిసిఓడీ కంట్రోల్ చేయచ్చో తెలుసుకుందాం. 

తీసుకోకూడని పదార్థాలు:

1. ముందుగా పిసిఓడి ఉన్న మహిళలు జంక్ ఫుడ్‌ని దూరం పెట్టాలి.

2. ఇంట్లో చేసుకొని తినే ఆహారంలో ఆయిలో డీ ప్రైడ్ చేసినటువంటి ఫుడ్‌ని తీసుకోవద్దు. నాన్‌వెజ్‌ని వీలైనంత తక్కువ మోతాదులో తీసుకోవటం మంచిది. 

3. నైట్ డిన్నర్ టైమ్‌లో రైస్ తీసుకునేవారు వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్‌ని తీసుకోవాలి. 

4. ఆలుగడ్డలు, చామగడ్డలు, దుంపలు లాంటివి తీసుకోకూడదు. 

తీసుకోవలసిన పదార్థాలు:

1. ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.

2. కాలిఫ్లవర్, బ్రాకోలిని కూడా తీసుకోవచ్చు. 

3. రెడ్ బెర్రీస్, బ్లూ బెర్రీస్ ని తినడం మంచిది. 

4. సంత్రా, మోసంబి, లెమెన్ జ్యూస్ తీసుకోవచ్చు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్