ముఖం తల తల మెరిసిపోవాలంటే ఇలా చేయండి.. ఈ ట్రిక్స్ తో నిగారింపు మీ సొంతం

వృత్తి, వ్యాపారత్య ప్రస్తుతం ప్రతి ఒక్కరూ బిజీగా గడుపుతున్నారు. ఒకసారి ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్తే మళ్లీ తిరిగి ఎప్పుడో రాత్రికి గానీ ఇంటికి రా అని పరిస్థితి. ఉరుకుల పరుగుల జీవితంలో తినే తిండి గురించి కూడా ఆలోచించలేని పరిస్థితి. అటువంటిది ముఖం గురించి ఆలోచించే తీరిక చాలా మందికి ఉండడం లేదు. దీంతో చాలామంది యుక్త వయసులోనే ముఖం నిగారింపును కోల్పోయి వయసు పైబడిన వారిలా కనిపించేలా చేస్తోంది.

Washing the face

ముఖం కడుక్కోవడం

వృత్తి, వ్యాపారత్య ప్రస్తుతం ప్రతి ఒక్కరూ బిజీగా గడుపుతున్నారు. ఒకసారి ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్తే మళ్లీ తిరిగి ఎప్పుడో రాత్రికి గానీ ఇంటికి రా అని పరిస్థితి. ఉరుకుల పరుగుల జీవితంలో తినే తిండి గురించి కూడా ఆలోచించలేని పరిస్థితి. అటువంటిది ముఖం గురించి ఆలోచించే తీరిక చాలా మందికి ఉండడం లేదు. దీంతో చాలామంది యుక్త వయసులోనే ముఖం నిగారింపును కోల్పోయి వయసు పైబడిన వారిలా కనిపించేలా చేస్తోంది. అయితే చిన్నపాటి జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా ముఖం నిగారింపును సొంతం చేసుకునేలా చేయవచ్చు. ముఖం జిడ్డుగా ఉన్న, బయటకు వెళ్ళవచ్చినప్పుడు ధూళితో నిండి ఉన్న చాలామంది ముఖం కడుక్కుంటారు. ముఖం కడుక్కోవడం వల్ల ముఖ శర్మానికి ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అదనపు దుమ్మి, ధూళిని తొలగించడం ద్వారా చర్మ సంరక్షణ కోసం మంచి ఫేస్ వాష్ కు ప్రత్యామ్నాయం లేదని నిపుణులు చెబుతున్నారు. ముఖం కడుక్కోవడంలో పొరపాటు చేస్తే ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. చాలామంది బయటికి వెళ్లి వచ్చిన తర్వాత స్నానం చేసి రాత్రిపూట పడుకుంటారు. కానీ పడుకునే ముందు ముఖం కడుక్కోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

ఇది చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన మురికిని తొలగిస్తుంది. కాబట్టి రోజు పడుకునే ముందు ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవడం చాలా అవసరం. రాత్రి ఇంటికి తిరిగి వచ్చి నిద్ర ఉపక్రమించిన ముందు, తరువాత ఉదయం మళ్ళీ ముఖం కడుక్కోవాలి. లేదంటే చర్మం దెబ్బతింటుంది. ఉదయం నిద్ర లేచిన తర్వాత తప్పనిసరిగా ముఖం కడుక్కోవడం మంచిది. దీనివల్ల అదనపు జిడ్డు చర్మం ఉన్నవారు మీ ముఖాన్ని కేవలం నీటితో కడుక్కోవడానికి ముందు ఒక బ్లాటింగ్ పేపర్ తో అదనపు నూనెను తుడి చేయాలి. లేదంటే ముఖంపై మొటిమల సమస్య ఇబ్బందికి గురిచేస్తుంది. ముఖాన్ని శుభ్రం చేసుకునేందుకు చాలామంది ఫేస్ వాష్ క్రీములు కొనుగోలు చేస్తుంటారు. ఫేస్ వాష్ కొనుగోలు చేసేటప్పుడు చాలామంది తమ చర్మం గురించి ఆలోచించరు. చర్మం రకం తెలియకపోతే తేలికపాటి, నురుగులేని ఫేస్ వాష్ ను ఎంచుకోవాలి. ఈ చిన్నపాటి జాగ్రత్తలను తీసుకుంటే మొఖం మెరిసిపోతుంది అనే నిపుణులు చెబుతున్నారు. వీలైతే మధ్యాహ్న సమయంలో కూడా ముఖాన్ని వీటితో శుభ్రం చేసుకోవడం ద్వారా చాలావరకు ముఖంపై పేరుకుపోయిన దుమ్మి, దూళిని శుభ్రం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ చిట్కా ఒక అందాన్ని రెట్టింపు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ చిన్నపాటి జాగ్రత్తలను పాటించడం ద్వారా చిన్న వయసులోనే ముఖంపై ఏర్పడే ముడతలు, మొటిమలు వంటి ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందవచ్చు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్