షుగర్ పేషంట్లు..వీటికి దూరంగా ఉండటమే మంచిది.!

షుగర్ పేషంట్లు, అధిక బరువు తగ్గాలనుకునేవారు చక్కెరకు బదులుగా క్రుత్రిమ స్వీటేనర్ తీసుకుంటారు. అయితే వీటిలో కొన్నింటిలో ఆస్పర్టేమ్ ను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు.

Diabetes

ప్రతీకాత్మక చిత్రం 

నేటికాలంలో మధుమేహం, ఊబకాయం సాధారణం అయ్యింది. వీటిని బారిన పడిన వారు చాలా మంది చక్కెరకు బదులుగా స్వీటెనర్స్ ను తీసుకుంటారు. అయితే వీటిలో కొన్నింటిలో అస్పెర్టమ్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ క్రమంలో స్వీటెనర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని ఆహార పదార్థాల వలే స్వీటెనర్స్ కూడా అందరికీ పడకపోవచ్చు. కొంతమందిలో వీటిని తీసుకుంటే కడుపు ఉబ్బరం, జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండటం మంచిదని చెబుతున్నారు నిపుణులు. 

క్యాలరీల విషయంలో: 

స్వీటెనర్స్ లో క్యాలరీలు తక్కువగా..కొన్నింటిలో అయితే అసలు క్యాలరీలే ఉండవు. అందుకే కొంతమంది తమ ఫిట్‌నెస్ కాపాడుకునేందుకు, బరువు తగ్గేందుకు ప్రయత్నించే వారు వీటిని తమ ఆహారంలో చేర్చుకుంటారు. అయితే ఆరోగ్యకరమైన బరువు ఉండాలంటే శరీరానికి అవసరమైన నిర్ణీత క్యాలరీల విషయం అసలు రాజీపడొద్దంటున్నారు నిపుణులు. 

సహజసిద్ధ పదార్థాలు: 

క్రుత్రిమ స్వీటెనర్స్ కు బదులుగా సహజ సిద్ధమైన పదార్థాలు వాడటం మంచిది. తక్కువ కేలరీలు ఉన్న స్వీటెనర్స్ కోసం సహజంగా లభించే పదార్థాలను ఉపయోగించాలంటున్నారు నిపుణులు. వీటిని తీసుకోవడం వల్ల కేవలం రుచి మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు అంటున్నారు. 

తగినంత నీరు: 

మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తగినన్ని నీళ్లు తీసుకోవడం మర్చిపోవద్దు. అయితే కొంతమంది స్వీటెనర్స్ ఉన్న పానీయలు తీసుకుంటారు. నీళ్లను ముట్టరు. కానీ అలాంటప్పుడు కూడా నీళ్లు తాగాలని చెబుతున్నారు నిపుణులు. నీళ్లు శరీరంలోని ట్యాక్సిన్స్ ను తొలగించి డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతాయి. 



సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్