మధుమేహ వ్యాధిగ్రస్తులు స్వీట్లు తినకూడదు. తినాల్సి వచ్చిన మితంగా తినాలి. కానీ డయాబెటిస్ పేషంట్లు బొప్పాయి తినవచ్చా. ఎందుకంటే ఈ పండు తియ్యగా ఉంటుంది. ఇలాంటి సందేహం చాలా మంది డయాబెటిక్ పేషంట్లలో ఉంది. మరీ వైద్యులు ఏం చెబుతున్నారో చూద్దాం.
ప్రతీకాత్మక చిత్రం
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారం తీసుకోవడంలో ఏమాత్రం పొరపాటు చేసినా..చక్కెర స్థాయి పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం. మధుమేహ వ్యాధిగ్రస్తులు ముఖ్యంగా స్వీట్లు తినకూడదు. కానీ చాలా మంది డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు స్వీట్లు తినాలనే కోరిక ఉంటుంది. చాలా మంది డయాబెటిక్ పేషెంట్లు బొప్పాయి వంటి పండ్లను స్వీట్లుగా తినవచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.మరి వైద్యులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
డయాబెటిక్ రోగులు బొప్పాయిని తీసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే..బొప్పాయిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీని గ్లూకోజ్ శోషణ సామర్థ్యం సుమారు 60గా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, దీనిని తీసుకోవడం వల్ల డయాబెటిక్ రోగుల రక్తంలో చక్కెర పెరగదని తెలిపారు.
డయాబెటిక్ రోగులకు బొప్పాయి మేలు:
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారం విషయంలో చాలా కఠినంగా ఉండాలి. కానీ వారు తమ ఆహారంలో బొప్పాయి వంటి పండ్లను తీసుకోవచ్చు. నిజానికి బొప్పాయిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.షుగర్ రోగులు తమ ఆహారంలో ఈ పండును చేర్చుకోవచ్చు. కొన్ని పరిశోధనల ప్రకారం, ఇందులో హైపోగ్లైసీమిక్ ప్రభావాలు ఉన్నాయని తెలిపారు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని తక్కువగా ఉంచడంలో చాలా సహాయకారిగా ఉంటాయి.
బొప్పాయిలో సహజ యాంటీ ఆక్సిడెంట్లు అయిన ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి మన బ్లడ్ షుగర్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. చాలా మంది పరిశోధకులు ఈ పండు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. అయితే వారు దీన్ని ఎక్కువ పరిమాణంలో తినాలని కాదు. మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే, తీపి పదార్థాలను అధికంగా తీసుకోవడం మీకు హానికరం అని గుర్తుంచుకోండి. కాబట్టి అలాంటి వ్యక్తులు ఎప్పుడూ పండ్ల ఆహారాన్ని అనుసరించకూడదు.
ఒక రోజులో ఎంత తినాలి?
ఒక రోజులో ఎంత తినాలి.మీరు ఒక రోజులో ఒక గిన్నె బొప్పాయిని తినవచ్చు. అంటే మీరు ఒక రోజులో 200 గ్రాముల నుండి 250 గ్రాముల బొప్పాయిని తినవచ్చు. అయితే ప్రతిరోజూ బొప్పాయి తినకూడదని గుర్తుంచుకోండి. మీరు మీ అవసరాన్ని బట్టి మాత్రమే తినాలి.