శరీరానికి ఎంతో మేలు చేసే ఖర్జూరం పాలు..

ఖర్జూరంలో న్యూట్రిషన్లు, విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఖర్జూరంలో ఫైబర్, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని పిల్లలకు ఆహారంగా తినిపించినా, పాలల్లో కలిపి తాగించినా ఒంటికి పుష్టి.

dates milk

ప్రతీకాత్మక చిత్రం 

ఖర్జూరంలో న్యూట్రిషన్లు, విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఖర్జూరంలో ఫైబర్, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని పిల్లలకు ఆహారంగా తినిపించినా, పాలల్లో కలిపి తాగించినా ఒంటికి పుష్టి. ముఖ్యంగా ఖర్జూరం నేరుగా కాకుండా పాలతో ఖర్జూర పాలను తయారు చేసుకొని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఖర్జూర పాలను ఎలా తయారు చేసుకోవాలి, కావలసిన పదార్థాలు ఏంటంటే..

కావలసిన పదార్థాలు: ఖర్జూరాలు 6, బాదాం పలుకులు గుప్పెడు, 3 యాలకులు, 2 కప్పు పాలు, చిన్న బెల్లం ముక్క

తయారు విధానం: ముందుగా ఖర్జూరంలోని గింజలను తీసివేసి వేడి నీటిలో ఒక పది నిమిషాల పాటు నాననివ్వాలి. ఆ తర్వాత ఒక మిక్సి గిన్నెలో తీసుకొని అందులో నానబెట్టిన ఖర్జూరాలు, 10 నుండి 12 బాదాం పలుకులు, 3 యాలకులను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకోవాలి. ఆ బౌల్‌లో 2 కప్పుల పాలను పోసి బాగా మరగనివ్వాలి. పాలు మరిగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని కొంచెం కొంచెం ముద్దలు లేకుండా పాలలో వేసి కలుపుకోవాలి. మొత్తం మిశ్రమం పాలలో కలిశాక ఒక గ్లాస్‌లోకి సర్వ్ చేసుకొని ఒక చిన్న బెల్లం ముక్కను కలుపుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన ఖర్జూరం పాలు రెడీ.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్