సింగపూర్ లో విజృంభిస్తున్న కరోనా

కరోనా వైరస్ మరోసారి ప్రపంచాన్ని భయపెడుతోంది. గడచిన కొన్నాళ్లుగా కొత్త కేసులు నమోదు లేకపోవడంతో.. కరోనా వైరస్ పూర్తిగా ముగిసిందని అంతా భావించారు. అయితే సింగపూర్ లో కొద్ది రోజుల నుంచి కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. ఈ నెల ఐదో తేదీ నుంచి 11 వ తేదీ మధ్య వందలాది మంది కరోనా వైరస్ బారిన పడ్డారు.

కరోనా వైరస్
కరోనా వైరస్



కరోనా వైరస్ మరోసారి ప్రపంచాన్ని భయపెడుతోంది. గడచిన కొన్నాళ్లుగా కొత్త కేసులు నమోదు లేకపోవడంతో.. కరోనా వైరస్ పూర్తిగా ముగిసిందని అంతా భావించారు. అయితే సింగపూర్ లో కొద్ది రోజుల నుంచి కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. ఈ నెల ఐదో తేదీ నుంచి 11 వ తేదీ మధ్య వందలాది మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వారం రోజుల్లోనే 25,900 కేసులు నమోదైనట్లు సింగపూర్ అధికారులు వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కరోనా వైరస్ కేసులు భారీగా నమోదవుతుండడంతో సింగపూర్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసులు నమోదవుతున్న ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లోని ప్రజలు మాస్కులు ధరించాలని ప్రభుత్వం ప్రజలకు ఆదేశించింది. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి దశలో ఉందని, రానున్న రెండు నుంచి నాలుగు వారాల్లో భారీగా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని సింగపూర్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకు అనుగుణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రస్తుతం ప్రతిరోజు 250 నుంచి 500 వరకు ప్రజలు కరోనా వైరస్ బారినపడి ఆసుపత్రుల్లో చేరుతున్నారు. పెరుగుతున్న కేసులకు అనుగుణంగా ఆసుపత్రులను సింగపూర్ ప్రభుత్వం సిద్ధం చేసింది. ప్రస్తుతం కరోనా వైరస్ బారిన పడుతున్న వారిలో ఎక్కువగా 60 ఏళ్ల పైబడిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అదనపు వ్యాక్సిన్ డోసులు తీసుకోవాల్సిందిగా ప్రజలకు ఆ దేశ ప్రభుత్వం సూచనలు చేసింది. ప్రస్తుతం సింగపూర్ లో నమోదవుతున్న కోవిడ్ కేసులు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మరోసారి వైరస్ వ్యాప్తి చెందుతుందేమో అన్న ఆందోళన అనేక దేశాలు వ్యక్తం చేస్తున్నాయి. సింగపూర్ లో నమోదు అవుతున్న కోవిడ్ కేసులపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా దృష్టి సారించింది.  కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు మరణించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ బారిన పడి కోరుకున్న ఎంతోమంది ఇప్పటికీ అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో కరోనా వైరస్ పేరు వింటేనే ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మళ్లీ ప్రస్తుతం సింగపూర్ లో వైరస్ వ్యాప్తి చెందుతూ ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్