యాంటీబయాటిక్స్ కొనేందుకు మందుల షాపుకు వెళ్తున్నారా.. ఇది చదవండి

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ప్రతీకాత్మక చిత్రం||

చిన్న రోగమొచ్చినా ఒక యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ వేసుకో.. తగ్గిపోతుంది! అని చెప్తుంటారు. వైద్యులు కూడా ఇబ్బడిముబ్బడిగా యాంటీబయాటిక్స్ రాసేస్తున్నారు. ఇలా చాలాచోట్ల యాంటీబయాటిక్స్ దుర్వినియోగం అవుతుండటంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక నుంచి ఏ ఒక్కరికీ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ ఇవ్వొద్దని ఫార్మాసిస్ట్ అసోసియేషన్లకు కఠిన నిబంధనలు జారీ చేసింది. ఈ మేరకు కఠిన నిబంధనలను వివరిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్‌ఎస్) ఫార్మాసిస్టులకు లేఖ రాసింది. అందులో అర్హత ఉన్న వైద్యుల సిఫార్సు మేరకే యాంటీబయాటిక్స్ ఇవ్వాలని స్పష్టం చేసింది. షెడ్యూల్ హెచ్, హెచ్1 నిబంధనలు పాటించాలని, సరైన ప్రిస్క్రిప్షన్ ఉంటేనే యాంటీబయాటిక్స్ అమ్మాలని తేల్చి చెప్పింది. ఎందుకోసం యాంటీబయాటిక్స్ వాడుతున్నారన్నదీ ప్రిస్క్రిప్షన్‌పై డాక్టర్లు పేర్కొనాలని వెల్లడించింది.

వెబ్ స్టోరీస్