లవంగాలతో ఈ 5 పనులు చేస్తే చాలు.. మీ అప్పులు తీరి లక్ష్మీదేవి కటాక్షం లభించడం ఖాయం

ఆర్థిక సమస్య ఉంటే లక్ష్మీదేవికి ఎర్రటి గులాబీ పువ్వులతో పాటు రెండు లవంగాలను సమర్పించండి. ఇలా చేస్తే ఇంట్లో డబ్బు ప్రవాహంలా వస్తుందని శాస్త్రం చెబుతోంది.

cloves for health

ప్రతీకాత్మక చిత్రం Photo: x.com

ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఆర్థిక కష్టాలు అనేవి చాలా బాధిస్తూ ఉంటాయి.. ఒక్కోసారి మనకు అనుకోని ఖర్చులు వచ్చినప్పుడు మీరు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.  అలాంటి అప్పులు గుదిబండగా మారి మీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజార్చుతాయి.  కొన్నిసార్లు మీకు ఆదాయం కల్పించే వనరులు కూడా మూసుకొని పోతాయి.  ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు మీరు చాలా ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది.  ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు జ్యోతిష్య శాస్త్రంలో కూడా కొన్ని చిట్కాలు ఉన్నాయి వీటిని పాటించినట్లయితే మీరు ఆర్థిక కష్టాల నుంచి బయటపడే అవకాశం లభిస్తుంది. అలాంటి చిట్కాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.  ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీ జీవితంలో ఉన్నటువంటి ఆర్థిక బాధలు తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షంతో తులతూగుతారు.

మీకు ఆర్థిక సమస్య ఉంటే లక్ష్మీదేవికి ఎర్రటి గులాబీ పువ్వులతో పాటు రెండు లవంగాలను సమర్పించండి. ఇలా చేస్తే ఇంట్లో డబ్బు ప్రవాహంలా వస్తుందని శాస్త్రం చెబుతోంది. అలాగే 5 లవంగాలను ఎర్రటి గుడ్డలో మూట కట్టి పూజగదిలో భద్రంగా ఉంచండి. ఇది సంపదను పెంచుతుంది.

శత్రువుల నుంచి  కష్టాలు తొలగిపోతాయి..

మీకు శత్రువుల నుంచి అనేక బాధలు ఉంటే ఒక  శివలింగం ఏర్పాటు చేసుకొని నీళ్లతో పాటు 2 లవంగాలు సమర్పించండి. ఇలా 40 రోజుల పాటు నిరంతరం చేస్తే దుష్ట శక్తులు, శత్రువులు నాశనం అవుతారు.

పనిలో విజయం

మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ పనిలో విజయం సాధించలేకపోతే చింతించకండి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు 2 లవంగాలను నోటిలో పెట్టుకోండి. ఇలా చేస్తే మీరు వెళ్లే పని విజయవంతం అవుతుంది.

రాహు కేతు దోషం తొలగిపోతోంది. 

రాహుకేతు దోషం జీవితంలో ఆటంకాలు సృష్టిస్తుంది. ఈ దోషం పోవాలంటే శనివారం నాడు 21 లవంగాలను తీసుకొని, ఎవరికైనా దానం చేయండి. నిరంతర 11వ శనివారాలు చేసినట్లయితే రాహు, కేతువుల దోషాలను తొలగిస్తుంది. మీరు ప్రతి పనిలో విజయం పొందే అవకాశం ఉంది. 

అప్పుల్లో చిక్కుకున్న డబ్బు తిరిగి వస్తుంది

ఒక్కో సారి మీ డబ్బు అప్పులు లేదా ఇతర పెట్టుబడుల్లో చిక్కుకొని పోయినప్పుడు, ఆ డబ్బును తిరిగి పొందడానికి అమావాస్య లేదా పూర్ణిమ రోజున లవంగాలతో చిన్న పరిహారం చేయండి. 21 లవంగాలను తీసుకుని వాటిని అమావాస్య లేదా పౌర్ణమి రాత్రి ఒక మంట వెలిగించి అందులో కాల్చండి. ఆ సమయంలో లక్ష్మీదేవిని ధ్యానించండి. ఈ హవనం ద్వారా మీ నిలిచిపోయిన డబ్బును తిరిగి లభిస్తుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్