chronic low back painతో లైంగిక సమస్యలు తలెత్తుతాయా?.. వైద్యనిపుణులు ఏమంటున్నారంటే..

ప్రస్తుతం ఉన్న జనరేషన్‌లో ఆడ, మగ అని తేడా లేకుంగా, వయసుతో సంబంధం లేకుండా నూటికి 60 శాతం మందిలో కామన్‌గా ఉన్న సమస్య దీర్ఘకాలిక వెన్నునొప్పి. ఈ దీర్ఘకాలిక వెన్నునొప్పి అంటే విపరీతంగా వచ్చే మెడనొప్పి, నడుము నొప్పి.

BACK PAIN

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం ఉన్న జనరేషన్‌లో ఆడ, మగ అని తేడా లేకుంగా, వయసుతో సంబంధం లేకుండా నూటికి  60 శాతం మందిలో కామన్‌గా ఉన్న సమస్య దీర్ఘకాలిక వెన్నునొప్పి. ఈ దీర్ఘకాలిక వెన్నునొప్పి అంటే విపరీతంగా వచ్చే మెడనొప్పి, నడుము నొప్పి. 3 నెలలు లేదా అంతకంటే ఎక్కువ రోజులు నొప్పితో బాధపడుతుంటే దాన్ని దీర్ఘకాలిక నడుం నొప్పి అంటారు. ఈ దీర్ఘకాలిక నడుము నొప్పి ఉన్నవాళ్లకి ఇతర సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అవి ఏటంటే  ఒత్తిడి, లైంగిక సమస్యలు, నిద్ర భంగం. 

ఒత్తిడి: నడుము నొప్పి తగ్గడం లేదు.. చాలా కాలం నుంచి ఉంటోంది.. ఎన్ని ట్రీట్‌మెంట్స్ తీసుకున్నా అలాగే ఉంటుంది అనేవారు ఒత్తిడికి గురవుతుంటారు.

లైంగిక సమస్యలు: దీర్ఘకాలిక నడుం నొప్పి ఉండేవారిలో..( మహిళల్లో కానీ, పురుషుల్లో కానీ) శృంగారం చేసేటప్పుడు నడుం నొప్పి వస్తుంది. ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనలేరు. ప్రీ మెచ్యుర్ ఎజాక్యులేషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి.

నిద్ర భంగం: రాత్రి సమయంలో నొప్పి పెరగడం వల్ల సరిగా నిద్ర పోలేరు. ఈ నిద్ర లేకపోవడం వల్ల ఉదయం లేవగానే వారిలో కోపం ఎక్కువగా ఉండటం, ఏం పని చేసినా ఇబ్బంది అనిపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

అందువల్ల దీర్ఘకాలిక నడుము నొప్పితో బాధ పడేవారు వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించి ఒత్తిడి, లైంగిక సమస్యలు, నిద్ర భంగం.. ఇతర సమస్యల నుంచి పరిష్కారానికి మెరుగైన వైద్యం తీసుకోవడం ఉత్తమం.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్