ప్రపంచవ్యాప్తంగా గడిచిన కొన్నాళ్లుగా బీపీ, షుగర్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. భారత అయితే షుగర్ వ్యాధిగ్రస్తుల కేంద్రంగా మారిపోయింది. ఒక్కసారి ఈ వ్యాధులు చుట్టూ ముడితే జీవితాంతం మందులు వాడాల్సిన పరిస్థితి అన్నట్టుగా తయారైంది. వీటిని మందులు వాడడం ద్వారా నియంత్రణలో ఉంచుకోవడం మాత్రమే సాధ్యపడుతుంది. అయితే జపాన్ పరిశోధకుల తాజా అధ్యయనంలో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రతిరోజు చక చక నడవడం ద్వారా బీపీ, షుగర్ వంటి సమస్యలకు చెప్పవచ్చని తేలింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రపంచవ్యాప్తంగా గడిచిన కొన్నాళ్లుగా బీపీ, షుగర్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. భారత అయితే షుగర్ వ్యాధిగ్రస్తుల కేంద్రంగా మారిపోయింది. ఒక్కసారి ఈ వ్యాధులు చుట్టూ ముడితే జీవితాంతం మందులు వాడాల్సిన పరిస్థితి అన్నట్టుగా తయారైంది. వీటిని మందులు వాడడం ద్వారా నియంత్రణలో ఉంచుకోవడం మాత్రమే సాధ్యపడుతుంది. అయితే జపాన్ పరిశోధకుల తాజా అధ్యయనంలో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రతిరోజు చక చక నడవడం ద్వారా బీపీ, షుగర్ వంటి సమస్యలకు చెప్పవచ్చని తేలింది. పెద్ద పెద్ద అడుగులు వేస్తూ నడిచే వారిలో బిపి, షుగర్ వంటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయని ఈ పరిశోధనలో తేటతెల్లమైంది. రంగా నడిచేవారు మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బుల ముప్పు తక్కువగా ఉంటుందని ఈ అధ్యాయంలో వెల్లడైంది. జపాన్ కు చెందిన దోషీ షా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యాయంలో భాగంగా స్థూలకాయం, నడుము చుట్టుకొలత ఎక్కువగా ఉన్న 25 వేల మందిపై అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ 25 వేల మందిలో తమను తాము వేగంగా నడిచేవారుగా అభివర్ణించుకున్న వారికి మధుమేహం వచ్చే ముక్కు 30% తక్కువగా ఉన్నట్లు వెళ్లడైంది. రక్తపోటు, డిస్ లిపిడేమియా (రక్తంలో కొవ్వు స్థాయిలో అసాధారణంగా ఉండడం) ముప్పు కూడా తక్కువేనని తేలింది. కాబట్టి ఊబకాయంతో బాధపడే వారు కూడా వేగంగా నడపగలిగితే వారికి ఈ వ్యాధులు వచ్చే ముప్పు తగ్గుతుందని ఈ పరిశోధకులు వెల్లడించారు. తాజా పరిశోధన ద్వారా ప్రపంచ వ్యాప్తంగా బిపి, షుగర్ వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయన్న ఆందోళనలకు చెక్ చెప్పినట్లు అయింది.
ఈ అధ్యాయంలో భాగంగా వారిని కొన్ని వారాలపాటు పరిశీలించినట్లు పరిశోధకులు వెల్లడించారు. వారి నడక తీరు, నడక సందర్భంగా వారి బ్రీతింగ్ సామర్థ్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. కొన్ని వారాలపాటు పరీక్షించిన అనంతరం వారికి బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించగా చాలామందిలో ఇటువంటి సమస్యలు లేనట్లు నిర్ధారణ అయింది. ఎందుకు అనేక సాంకేతిక అంశాలు పనిచేస్తున్నట్లు ఈ పరిశోధకులు గుర్తించారు. బీపీ, షుగర్ వంటి సమస్యలు బారిన పడకుండా ఉండాలంటే మీరు కూడా ఇకపై చక చక నడిచేయండి అని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా రోజువారి నటక వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. ఈ నడక మరింత వేగంగా ఉండడం వల్ల మరింత బెనిఫిట్స్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రన్నింగ్ కంటే వాకింగ్ వల్ల మంచి ఫలితాలు ఉంటాయన్న పరిశోధనలు ఇప్పటికే వెళ్లడయ్యాయి. తాజాగా జపాన్ పరిశోధకుల పరిశోధన ఫలితాలతో వేగంగా నడవడం వల్ల బిపి, సుగర్ సమస్యలకు చెప్పేందుకు అవకాశం ఉంటుందని మరోసారి స్పష్టమైంది.