పిల్లలకు Cerelac ఇవ్వడం సరైనదా? అసలు నిజం ఇదిగో ఇక్కడ!

Celerac for Babies | పిల్లలకు ఆహారం పెట్టే సమయం అంటే ఆరు నెలలు పడగానే ఏం పెట్టాలి? ఎలా పెట్టాలి? అని తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. చాలా మంది తల్లిదండ్రులు హోమ్‌మేడ్ సెరెలాక్ తయారుచేసి పెడుతుంటారు.

issues for eating cerelac

ప్రతీకాత్మక చిత్రం

పిల్లలకు ఆహారం పెట్టే సమయం అంటే ఆరు నెలలు పడగానే ఏం పెట్టాలి? ఎలా పెట్టాలి? అని తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. చాలా మంది తల్లిదండ్రులు హోమ్‌మేడ్ సెరెలాక్ తయారుచేసి పెడుతుంటారు. హోమ్‌మేడ్ సెరెలాక్ పిల్లలకు చేసి పెట్టడం చాలా మంచిది. కానీ మరికొందరు తల్లిదండ్రులు మార్కెట్‌లో దొరికే సెరెలాక్ ఉపయోగించడం మొదలుపెడతారు.మనందరికీ తెలిసిన విషయమే: సెరెలాక్ అంటే అప్పటికప్పుడు వేడినీళ్లతో కలిపి పిల్లలకు తినిపించడం. ఇది చాలా తేలికగా, త్వరగా అయిపోతుంది. ముఖ్యంగా ఉద్యోగాల్లో ఉన్న తల్లిదండ్రులు ‘టైమ్‌కి ఫుడ్ ఎవరు చేసిపెడతారు?’ అని సెరెలాక్ వాడుతున్నారు.ట్రావెలింగ్ చేస్తూ, వండటం ఆలస్యం అవుతుందనుకుంటే కూడా అప్పటికప్పుడు సెరెలాక్ వేడి నీళ్లలో కలిపి వాడుతున్నారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.

ఇష్టంగా తినడానికి సెరెలాక్‌లో ఏమేం ఉపయోగిస్తారో మీకు తెలుసా?

ఒక సెరెలాక్ ప్యాకెట్ తీసుకోండి. అందులో న్యూట్రిషన్ హిస్టరీ చూసినప్పుడు 100 గ్రాముల సెరెలాక్‌లో 9 గ్రాముల చక్కెర ఉంటుంది. అంటే 100 గ్రాములకు 2 స్పూన్లు చక్కెర. ఒక ప్యాకెట్‌లో 300 గ్రాముల సెరెలాక్ ఉంటుంది. అంటే మొత్తం 6 స్పూన్లు చక్కెర. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ఒక సంవత్సరంలోపు ఉన్న పిల్లల ఆహారంలో ఉప్పు, చక్కెర ఉండకూడదు. దీనివల్ల పిల్లల ఆరోగ్యానికి హానికరం. సెరెలాక్ ప్యాకెట్‌పై ఎన్ని నెలల పిల్లలకు, రోజుకి ఎంత తినిపించాలో గైడ్ ఉంటుంది. ఉదాహరణకి: 6-10 నెలల పిల్లలకు రోజుకి 50 గ్రాముల సెరెలాక్ పెట్టాలని సూచిస్తారు.అయితే, ఆ ప్యాకెట్ 6 రోజుల్లో అయిపోతుంది. అంటే నెలకు 5 ప్యాకెట్లు.ఇందులో 30 స్పూన్లు చక్కెర ఉంటుంది.చిన్ననాటి నుంచే ఈ పద్ధతి పాటించడం వల్ల పిల్లలు లావుగా తయారవుతారు.షుగర్ ఉన్న ఫుడ్‌పై అలవాటు పెంచడం వల్ల హెల్దీ ఫుడ్‌కి ఆసక్తి తగ్గుతుంది. పిల్లలు చిన్నతనం నుంచే చాక్లెట్లు, లాలీపాప్స్ వంటి వాటిపై ఇష్టాన్ని పెంచుకుంటారు. అందువల్ల ఊబకాయం, దంతక్షయం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు వస్తాయి. పిల్లలకు తరచుగా జ్వరం, దగ్గు, జలుబు ఎక్కువగా వస్తాయి. ఇలా మాత్రమే కాకుండా, ఎదుగుతున్న పిల్లలకు ఇమ్యూనిటీ బూస్ట్ ఫుడ్స్ మార్కెట్‌లో తేవడం స్టార్ట్ చేస్తారు. అవి కూడా షుగర్ ఎక్కువగా ఉండే అవకాశముందని మీకు తెలుసా? 2 సంవత్సరాల లోపు పిల్లలకు రోజుకు ఆరు స్పూన్ల చక్కెర కూడా ఎక్కువే! మనం ఎక్కువగా షుగర్ ఉన్న ఫుడ్ తినిపిస్తూ, పిల్లల ఆరోగ్యాన్ని మనమే ప్రమాదంలో పడేస్తున్నాం.

న్యూట్రిషన్ హిస్టరీ ప్రకారం, సెరెలాక్‌లో:

బియ్యం పిండి (46.4%)

పాలు పొడి (34.2%)

చక్కెర (9%)

సోయాబీన్ నూనె (5.2%)

విటమిన్లు మరియు ఖనిజాలు (1.7%) వాడుతున్నారు.

గమనిక: ఒక సంవత్సరం లోపు ఉన్న పిల్లలకు సెరెలాక్, ఆవుపాలు ఇవ్వకూడదని చెబుతారు. ఎందుకంటే, చిన్న పిల్లల జీర్ణవ్యవస్థ చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు సెరెలాక్ తినిపించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్