చుక్క రక్తంతో క్యాన్సర్ నిర్ధారణ.. క్యాన్సర్ స్పాట్ ఆవిష్కరించిన రిలయన్స్

క్యాన్సర్ ను ప్రాథమిక దశలో నిర్ధారించే సరికొత్త క్యాన్సర్ స్పాట్ అందుబాటులోకి రాబోతోంది. ఈ టెస్ట్ అందుబాటులోకి వస్తే క్యాన్సర్ మహమ్మారిని ప్రాథమిక దశలోనే గుర్తించి మెరుగైన చికిత్స అందించేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ సరికొత్త క్యాన్సర్ టెస్టింగ్ కిట్ ను ఆవిష్కరించింది. దీంతో క్యాన్సర్ పరీక్ష సామాన్య జనాలకు అందుబాటులోకి రానుంది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

గడచిన కొన్నేళ్లుగా దేశ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. క్యాన్సర్ మహమ్మారిని ప్రాథమిక దశలో నిర్ధారించ లేకపోతుండడంతో ఏటా కొన్ని లక్షల మంది దేశంలో మృత్యువాత చెందుతున్నారు. ఈ నేపథ్యంలో క్యాన్సర్ ను ప్రాథమిక దశలో నిర్ధారించే సరికొత్త క్యాన్సర్ స్పాట్ అందుబాటులోకి రాబోతోంది. ఈ టెస్ట్ అందుబాటులోకి వస్తే క్యాన్సర్ మహమ్మారిని ప్రాథమిక దశలోనే గుర్తించి మెరుగైన చికిత్స అందించేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ సరికొత్త క్యాన్సర్ టెస్టింగ్ కిట్ ను ఆవిష్కరించింది. దీంతో క్యాన్సర్ పరీక్ష సామాన్య జనాలకు అందుబాటులోకి రానుంది. జెనోమిక్స్, బయో ఇన్ఫర్మేటిక్స్ లో అగ్రగామి కంపెనీగా ఉన్న స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ క్యాన్సర్ స్పాట్ అనే కొత్త రక ఆధారిత పరీక్షను ఆవిష్కరించింది. ఈ టెస్ట్ ద్వారా సాధారణ రక్త నమూనా తో క్యాన్సర్ ప్రారంభ లక్షణాలను గుర్తించనున్నారు. 

క్యాన్సర్ స్పాట్ డిఎన్ఏ మిథలైజేషన్ సిగ్నేచర్ ను ఉపయోగిస్తుంది. జీనోమ్ సీక్వెన్సింగ్, అనాల్సిస్ ప్రత్యేక ప్రక్రియ ద్వారా ప్రారంభ లక్షణాలను ఇది గుర్తిస్తుంది. ఈ సిగ్నేచర్ ను భారతీయుల డేటా ఆధారంగా అభివృద్ధి చేశారు. అయినప్పటికీ ఈ టెస్ట్ ప్రపంచంలోని ఇతర దేశాల ప్రజలకు కూడా ప్రభావవంతంగా ఉపయోగపడనుంది. ఈ పరీక్ష క్యాన్సర్ కు ప్రోయాక్టివ్, రొటీన్ స్క్రీనింగ్ కోసం సులభమైన అనుకూలమైన ఆప్షన్ ను అందిస్తుంది. క్యాన్సర్ స్పాట్ ఆవిష్కరణపై ముఖేష్ అంబానీ కుమార్తె, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డ్ సభ్యురాలు ఇషా అంబానీ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మానవజాతికి సేవ చేయడానికి రిలయన్స్ ఔషధాల రంగంలో కొత్త ఆవిష్కరణలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. క్యాన్సర్ ను ఓడించే యుద్ధంలో ఆ వ్యాధిని ముందస్తుగా గుర్తించడం చాలా ముఖ్యమైన అంశమని, ప్రజలకు సహాయపడే ఒక సాధారణ ధరలో ఉండే పరీక్షను ఆవిష్కరించినందుకు ఆనందంగా ఉందంటూ స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ వ్యవస్థాపకుడు అండ్ సీఈవో డాక్టర్ రమేష్ హరిహరన్ వెల్లడించారు. క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల్లో దీనిని గేమ్ చేంజ్ జరగా పలువురు నిపుణులు పేర్కొంటున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్