ప్రెగ్నెన్సీ ఉమెన్ మొలకలు తినవచ్చా..

గర్భధారణ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తలు పాటిస్తారు. అలాగే తీసుకునే ఆహరం కూడా ఆరోగ్యమైన ఆహరం తీసుకుంటారు. అయితే గర్భధారణ సమయంలో మొలకలు తినచ్చా లేదా అని ఆందోళన చెందుతారు

pregnancy sprouts

ప్రతీకాత్మక చిత్రం

వాస్తవంగా గర్భధారణ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తలు పాటిస్తారు. అలాగే తీసుకునే ఆహరం కూడా ఆరోగ్యమైన ఆహరం తీసుకుంటారు. అయితే గర్భధారణ సమయంలో మొలకలు తినవచ్చా? లేదా? అని ఆందోళన చెందుతుంటారు. మరి మొలకలు తినవచ్చా? అంటే.. మొలకలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మొలకలు తినటం ద్వారా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. మొలకెత్తిన గింజల్లో విటమిన్ ఎ, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి,విటమిన్ కె అధికంగా ఉంటాయి.

మొలకెత్తిన గింజలు ఆహారంగా తీసుకోవడం వలన అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. మొలకల్లో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా పెసర్లు, శనగలు, పల్లీలను మొలకెత్తినవి తీసుకోవడం వల్ల రక్త ప్రసరణలో తోడ్పడుతాయి. అలాగే జీర్ణక్రియను మెరుగుపరిచే ఎంజైమ్‌లు అధికంగా ఉంటాయి. ఈ ఎంజైమ్‌లు ప్రోటీన్లను, శరీరానికి ఉపయోగపడే ఆమైనోఆమ్లాలను, పిండి పదార్థాలను గ్లూకోజ్‌గా మారుస్తాయి. ఆరోగ్యానికి హాని కలిగించే కొవ్వు పదార్థాలు మొలకల్లో ఉండవు కాబట్టి వీటిని రోజువారీ ఆహారంగా తీసుకోవచ్చు.

పెసర్లు, శనగలు, పల్లీలు, బఠాణీలు, గోధుమలు, జొన్నలు, సోయాబీన్స్, చిక్కుడు వంటి గింజలను మొలకెత్తించి తినవచ్చు. ఈ గింజలు మొలకెత్తేటప్పుడు విటమిన్ ఎ 2 రెట్లు, విటమిన్ బి, సి లు 5 నుండి 10 రెట్లు అధికంగా లభ్యమవుతాయి. మొలకెత్తిన గింజలకు తోడు కీర, క్యారెట్, బీట్ రూట్ వంటి కూరగాయలను ముక్కలుగా కలుపుకొని కూడా తీసుకోవచ్చు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్