జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినొచ్చా.. తింటే ఏం జరుగుతుంది..

మన ఇంట్లో పెద్దలు అంటుంటారు జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చికెన్ తింటే పచ్చ కామెర్లు వచ్చే అవకాశం ఎక్కవగా ఉంటుంది అని.

eat chicken for fever

ప్రతీకాత్మక చిత్రం

చికెన్ ప్రియులకు ప్రతిరోజు ఇంట్లో ఏదో ఒక ప్రత్యేకమైన వంట చేసినా చికెన్ తినాలన్న కుతూహలం ఎప్పటికీ తగ్గదు. అయితే, జ్వరంతో ఉన్నప్పుడు చాలా వరకు నాన్‌వెజ్ వంటలకు, త్వరగా జీర్ణం కాని ఆహార పదార్థాలకు దూరంగా ఉంటారు. కొందరు మాత్రం జ్వరం వచ్చినా చికెన్ తినేస్తుంటారు. మరి అలా తినడం ఆరోగ్యానికి మంచిదేనా? జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినవచ్చా? తింటే ఏం జరుగుతుంది? అనే విషయాల గురించి తెలుసుకుందాం.. జ్వరం వస్తే చికెన్‌కు చాలా మంది దూరంగా ఉంటారు. పిల్లలకు పెట్టరు, పెద్దలు తినరు. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చికెన్ తింటే పచ్చ కామెర్లు వచ్చే అవకాశం ఎక్కవగా ఉంటుంది అని మన ఇంట్లో పెద్దలు అంటుంటారు. కానీ ఇదంతా అపోహేనని అంటున్నారు వైద్యులు. అనారోగ్యంతో ఉన్నప్పుడు అన్ని రకాల పోషకాలు శరీరానికి అందడం అత్యవసరం. రోగనిరోధక వ్యవస్థ అప్పటికే బలహీనపడి ఉంటుంది. కాబట్టి శరీరాన్ని రక్షించడానికి దానికి మరింత బలం అవసరం. అందుకు మంచి పోషకాలున్న ఆహారం తినాలి. ఆ సమయంలో జీర్ణ ప్రక్రియ కూడా మందగిస్తుంది. కాబట్టి వైద్యులు తేలికపాటి ఆహారాన్ని తినాలని చెబుతుంటారు. దీంతో జ్వరం రాగానే చాలా మంది కూరలు తినడం మానేస్తారు. రసం, అన్నం తినడానికే ఇష్టపడతారు. కానీ రసం అన్నం వల్ల శరీరానికి అంతే పోషకాలు తక్కువ. కాబట్టి జ్వరం వచ్చిన సమయంలో కూడా జీర్ణంగా సులువుగా అరిగే కూరలు వండుకుని తినాలి.

చికెన్ తినకూడదా?

జ్వరంతో బాధపడుతున్నప్పుడు చికెన్ తినడం సురక్షితమే. కానీ ఏ రూపంలో ఆ చికెన్ ను తింటున్నారు అనేదే ముఖ్యం. బాగా మసాలాలు దట్టించిన చికెన్ కూరలు, వేపుళ్లు, బిర్యానీలు జ్వరం వచ్చిన సమయంలో తింటే అనారోగ్యమే కలుగుతుంది. అందుకే ఆ సమయంలో చికెన్‌ను తక్కువ నూనెతో మసాలాలు లేకుండా వండుకుని తినాలి. సూప్ చేసుకుంటే మరీ మంచిది. ఇది ప్రొటీన్, ఫైబర్‌తో నిండి ఉంటుంది. జ్వరంతో బాధపడుతున్నవారికి ఈ రెండు అవసరమైన పోషకాలు. అయితే, నూనెలో వేయించిన ఫ్రైడ్ చికెన్, క్రిస్పీ చికెన్ ఇలాంటివి మాత్రం అస్సలు తినకూడదు. ఇలాంటి చికెన్ తింటే నిజంగానే అనారోగ్యం కలుగుతుంది. చికెన్ నగ్గెట్స్, బటర్ చికెన్, మసాలా, చికెన్ లాలీపాప్, చిల్లీ చికెన్ లాంటివి అస్సలు తినకూడదు. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ ఎలా తినాలంటే..

తక్కువగా ఆయిల్‌తో, స్పైసెస్ తక్కువగా వేసి చేసిన చికెన్‌ కర్రీని తింటే ఎలాంటి సమస్యలు ఉండవు. కర్రీలాగా కాకుండా చికెన్ సూప్స్ బెస్ట్ ఆప్షన్. జ్వరం వచ్చిన సమయంలో చికెన్ సూప్స్ తాగడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్, న్యూట్రిషన్స్ పుష్కలంగా అందుతాయి. జ్వరంతో ఉన్నామన్న భయం కూడా అవసరం ఉండదు. జ్వరం సమయంలో శరీరం డీహైడ్రేడ్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు సూప్స్ తాగడం వల్ల డీహైడ్రేడ్ కాకుండా ఉంటుంది. గ్రిల్డ్ చికెన్, రోస్టెడ్ చికెన్, బేక్డ్ చికెన్ టిక్కా, కినోవా చికెన్, చికెన్ తుక్పా లాంటి వాటిని కూడా తినొచ్చు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్