ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో ఓట్స్‌ని డైట్ ఫుడ్‌గా రోజు తీసుకుంటున్నారు. కానీ రోజు ఓట్స్ తినవచ్చా? ఒకవేళ తిన్నా అసలు ఓట్స్ ఎలా తినాలి? ఓట్స్ తింటే లాభాలు ఉన్నాయా? అనే సందేహలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి ఓట్స్ మంచి పౌష్టిక ఆహారం.
ప్రతీకాత్మక చిత్రం
ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో ఓట్స్‌ని డైట్ ఫుడ్‌గా రోజు తీసుకుంటున్నారు. కానీ రోజు ఓట్స్ తినవచ్చా? ఒకవేళ తిన్నా అసలు ఓట్స్ ఎలా తినాలి? ఓట్స్ తింటే లాభాలు ఉన్నాయా? అనే సందేహలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి ఓట్స్ మంచి పౌష్టిక ఆహారం. ఇందులో పీచు పదార్థం, విటమిన్ బి2, విటమిన్ సి అధిక మోతాదులో ఉంటాయి. కార్బోహైడ్రెట్స్, ప్రోటీన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. పిల్లలకు ఆహరంగా ఓట్స్‌ను ఏదో ఒక విధంగా ఇవ్వడం ద్వారా మంచి పోషకాలు అందుతాయి. ఓట్స్‌కు జిగురు గుణాన్ని తెచ్చిపెట్టే పీచు.. రక్తంలోని కొలెస్టాల్‌నూ వేరుచేస్తూ దాన్ని తగ్గించడంలో తోడ్పడుతుంది. శీతకాలంలో అల్పాహారంగా ఓట్స్‌ని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని ఆరోగ్య నిపుణులు తెలిపారు.
ఓట్స్‌లో పీచు శాతం ఎక్కువ. కొవ్వు సమస్య ఉండదు. బరువు తగ్గించడానికి ఆహార నియమాలు పాటించేవారు ఓట్స్‌ని తీసుకోవడం వల్ల మేలు కలుగుతుంది. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. బ్లడ్ కొలెస్టాల్‌ని నిర్ణీత స్థాయిలో ఉంచుతు గండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు దోహదపడుతాయి. అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. క్యాన్సర్ బారిన పడే అవకశాలను తగ్గిస్తాయి. డయాబెటిక్ పెషేంట్స్ వీటిని తీసుకుంటే షుగర్స్ వెంటనే పెరుగుతాయి. కాబట్టి డయాబెటిక్ పెషేంట్స్ వీటిని తీసుకోకూడదు. ఇందులో 10 గ్రాముల నుండి 100 గ్రాముల వరకు ప్రొటీన్స్ లభిస్తాయి. అలాగే 330 నుండి 340 వరకు క్యాలరీలు లభిస్తాయి. వీటిలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఓట్స్‌ని ఉదయం అల్పాహారంగా తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణలు సూచిస్తున్నారు.