Egg: డయాబెటిక్ పేషెంట్లు గుడ్లను తినొచ్చా…గుడ్డు తింటే షుగర్ పెరుగుతుందా..తగ్గుతుందా..?

సాధారణంగా కోడి గుడ్డును తినే విషయంలో డయాబెటిస్ పేషెంట్లు సందేహిస్తుంటారు. ఇందులో కొవ్వు అధికంగా ఉంటుంది. దీన్ని తింటే షుగర్ పెరుగుతుందా అనే అనుమానం ఉంటుంది.అయితే కోడి గుడ్డును డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

egg benefits
ప్రతీకాత్మక చిత్రం 

గుడ్డు అనేది సంపూర్ణ పోషకాహారంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పోషకాహార నిపుణులు అందరూ తేల్చారు. గుడ్లు ప్రోటీన్ పొందేందుకు ఒక  అద్భుతమైన మూలం. గుడ్డును ఎవరికి నచ్చినట్లు వారు తినవచ్చు. పోషకాలు అధికంగా ఉండే గుడ్డు డయాబెటిక్ పేషెంట్లు తినవచ్చా లేదా అనే సందేహాలు కలగడం సహజమే. ఎందుకంటే గుడ్డు పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఉంటుందని అది తింటే  మధుమేహం, గుండె జబ్బులు పెరిగే ప్రమాదం ఉందనే అపోహలు చాలా మందిలో ఉన్నాయి. దీనిపై పూర్తి విషయాలు తెలుసుకుందాం. 

గుడ్డులో ఉండే ప్రోటీన్ శరీరంలో షుగర్ ను ఎలా ప్రభావితం చేస్తుంది?

>>  మీరు అన్నంతో పాటు కోడిగుడ్డు తిన్నప్పుడు , అన్నంలోని కార్బోహైడ్రేట్‌లను  మీ శరీరం  గ్లూకోజ్‌గా మార్చడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగులలో భోజనం తర్వాత రక్తంలో షుగర్ స్థాయిని సైతం తగ్గిస్తుంది.

>>  1 గ్రాము ప్రోటీన్  శరీరంలో 4 కేలరీల శక్తిని అందిస్తుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. కేలరీల తీసుకోవడం తగ్గిస్తుంది, ఇది రక్తంలో షుగర్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది .

>>  తక్కువ ప్రోటీన్ కలిగి ఉన్న ఆహారం శరీరంలో కండరాలను బలహీనపరుస్తుంది. మధుమేహ రోగులలో ఇది కండరాలన క్షీణింప చేస్తుంది. ఈ నేపథ్యంలో కోడిగుడ్డును ప్రతి రోజు షుగర్ వ్యాధి గ్రస్తులు తీసుకుంటే వారికి కావాల్సిన ప్రోటీన్లు లభిస్తాయి. 

>> ప్రోటీన్లు తక్కువగా ఉంటే అది మీ కాలేయాన్ని దెబ్బ తీస్తుంది. లివర్ సిర్రోసిస్ ,  క్యాన్సర్‌కు కూడా దారితీస్తుంది. కాబట్టి, డయాబెటిక్ రోగులు ప్రోటీన్ లోపాన్ని తగ్గించడానికి గుడ్లను ఆహారంలో తీసుకోవాలి.

గుడ్డు సంపూర్ణ ఆహారం ఎలా అవుతుంది?

ఒక కోడి గుడ్డులో సుమారు  66 కేలరీలు, 6 గ్రాముల ప్రోటీన్, 4.6 గ్రాముల కొవ్వు ఉంటుంది, వీటిలో 20 శాతం కంటే ఎక్కువ సాచురేటెడ్ కొవ్వు ఉంటుంది. గుడ్లలో చాలా తక్కువ కార్బోహైడ్రేట్ ఉంటుంది. విటమిన్ B2 (రిబోఫ్లావిన్), విటమిన్ B12 , ఫోలేట్, బయోటిన్, పాంతోతేనిక్ యాసిడ్ ,  కోలిన్ వంటి అనేక ఇతర B విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఉపయోగపడే విటమిన్ ఎ, విటమిన్ డి, ఫాస్పరస్, అయోడిన్, సెలీనియంతో సహా అవసరమైన ఖనిజాలను కలిగి ఉంటుంది.

డయాబెటిక్ పేషెంట్ రోజుకు ఎన్ని గుడ్లు తినవచ్చు?

డయాబెటిస్ ఉన్న రోగులు ప్రతిరోజూ 15-20 శాతం కేలరీలను ప్రోటీన్ ద్వారా పొందాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. అందుకే డయాబెటిస్ పేషంట్లు కార్బోహైడ్రేట్ల కన్నా కూడా ప్రొటీన్లు తీసుకోవాలని డాక్టర్లు  సూచిస్తున్నారు. శరీరంలో ప్రోటీన్ లోపాన్ని తీర్చడంలో గుడ్డు చాలా సహాయకారి అని చెప్పవచ్చు.గుడ్డలో తక్కువగా కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఇది రక్తంలో షుగర్ ను పెంచే ప్రమాదం తగ్గిస్తుంది.  రెండు పెద్ద గుడ్లలో ఒక గ్రాము కార్బోహైడ్రేట్ మాత్రమే ఉంటుంది. అందువల్ల డయాబెటిక్ పేషెంట్లు రోజుకు రెండు గుడ్లను సులభంగా తీసుకోవచ్చు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్