మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరి. అయితే ఆ బ్రేక్‌ఫాస్ట్ ఆరోగ్యకరమైనది అయితే మరింత మంచిది. పౌష్టికాహారం దీర్ఘకాలం శక్తిని అందిస్తుంది. గంటల తరబడి మిమ్మల్ని పూర్తి శక్తితో ఉంచుతుంది.
ప్రతీకాత్మక చిత్రం
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరి. అయితే ఆ బ్రేక్‌ఫాస్ట్ ఆరోగ్యకరమైనది అయితే మరింత మంచిది. పౌష్టికాహారం దీర్ఘకాలం శక్తిని అందిస్తుంది. గంటల తరబడి మిమ్మల్ని పూర్తి శక్తితో ఉంచుతుంది. మంచి ఆహారం సాధారణంగా ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, సూక్ష్మపోషకాలను కలిగి ఉంటుంది. అందుకే ఉదయం ఖాళీ కడుపుతో తీసుకునే ఆహరం, పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మీరు మీ కడుపు, పేగు, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచాలంటే ఉదయం ఖాళీ కడుపుతో ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం.
ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉన్న అరటిపండ్లు మంచి బ్రేక్ ఫాస్ట్ అని చెప్పొచ్చు. ఉదయాన్నే రెండు అరటిపండ్లను తినడం వల్ల మీ రోజును అదనపు శక్తితో ప్రారంభించవచ్చు. బ్లడ్, షుగర్ తక్కువగా ఉన్నప్పుడు అరటిపండ్లలోని కార్బోహైడ్రెడ్స్ ఎనర్జీ బూస్టర్‌గా పనిచేస్తాయి. అల్పహారానికి ముందు అరటిపండు తినడం మంచిదని వైద్యనిపుణులు అంటున్నారు.
ఖర్జూరాన్ని రోజువారీ ఆహారంలో ఆరోగ్యకరమైన స్వీట్‌గా చెప్పచ్చు. సరైన ఆరోగ్యాన్ని పొందడంలో సహయపడే అన్ని రకాల పోషకాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. ఖర్జూరాల్లో కార్బోహైడ్రెట్స్, ఫైబర్, ప్రోటీన్స్, మెగ్నీషియం, ఐరన్, కాపర్, సోడియం, కాల్షియం మొదలైన ఖనిజాలు, విటమిన్ ఏ, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ సీ సమృద్ధిగా ఉంటాయి. మీ రోజువారీ ఆహారంగా ఖర్జూరాన్ని చేర్చుకోవడం వల్ల ఫ్రీ రాడికల్ డ్యామేజీ నుంచి రక్షించుకోవచ్చు. కరోనరీ హార్ట్ డిసీజ్, క్యాన్సర్ వంటి వ్యాధులను తగ్గిస్తుంది.
విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కె, క్యాల్షియం, ఐరన్, మెగ్నిషియం, పోటాషియం, సోడియాం, జింక్, ఫైబర్, ప్రోటిన్స్ వంటి పోషకాలు యాపిల్స్ లో పుష్కలంగా లభిస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో యాపిల్‌ని తినడం వల్ల ఎక్కువ లాభాలు పొందవచ్చు అని ఆరోగ్య నిపుణలు చెబుతున్నారు. అందులో ఉండే విటమిన్ సి శరీరాన్ని త్వరగా గ్రహిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ బలపరుతుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారు ఖాళీ కడుపుతో యాపిల్ తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఖాళీ కడుపుతో యాపిల్ తినడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. శరీరంలో వాపులు తగ్గుతాయి, మెదడు చురుగ్గా, శరీరం రోజంతా యాక్టివ్‌గా పనిచేస్తాయి.
బాదంపప్పులో విటమిన్-ఈ పుష్కలంగా ఉంటుంది. బాదం పప్పు రాత్రంతా నానబెట్టి పొద్దున తినడం చాలా మంచిది.
గుడ్లు సహజంగా లభించే ఇతర ఆహారాల కంటే ఎక్కువ ప్రోటిన్స్ కలిగి ఉంటాయి. ఉదయాన్నే గుడ్లు తినడం వల్ల కడుపు నిండుగా మారుతుంది. బరువు తగ్గటంలో కూడా దీని పాత్ర ఎంతగానో తోడ్పడుతుంది. గుడ్లలో ఐరన్, విటమిన్ డి, పోటాషియం, జింక్ ఉంటాయి. ఇవి మీ శక్తి స్తాయిలను పెంచుతాయి.