ఆ ఎంజైమ్ ను అడ్డుకుంటే క్యాన్సర్ కు చెక్.. గుర్తించిన దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఏటా కొన్ని లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే క్యాన్సర్ ను నివారించే పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో సాగుతున్నాయి. ఈ క్రమంలోనే దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో కీలక ముందడుగు వేశారు. శరీరంలో ఉండే ఆరోగ్యవంతమైన కణాలు.. క్యాన్సర్ కణాలుగా మారకుండా ఆపే ప్రక్రియను నిరోధించే ఒక ఎంజైమ్ ను దక్షిణ కొరియా శాస్త్రజ్ఞులు గుర్తించారు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఏటా కొన్ని లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే క్యాన్సర్ ను నివారించే పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో సాగుతున్నాయి. ఈ క్రమంలోనే దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో కీలక ముందడుగు వేశారు. శరీరంలో ఉండే ఆరోగ్యవంతమైన కణాలు.. క్యాన్సర్ కణాలుగా మారకుండా ఆపే ప్రక్రియను నిరోధించే ఒక ఎంజైమ్ ను దక్షిణ కొరియా శాస్త్రజ్ఞులు గుర్తించారు. ఆ ఎంజైమ్ ను నిరోధించడం ద్వారా క్యాన్సర్ కణాలు తిరిగి సాధారణ కణాలుగా మారతాయని ప్రయోగశాలలో ఆ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో తేలింది. మానవాళికి పెనుముప్పుగా మారిన క్యాన్సర్ మహమ్మారిపై ప్రపంచవ్యాప్తంగా సాగిస్తున్న పోరులో కీలక మైలురాయిగా ఇది నిలిచింది. శరీరంలో క్యాన్సర్ కణాలు తొలగించడానికి చత్ర చికిత్స, కీమోథెరపీ, ఇమ్యునో థెరఫీ వంటి విధానాలు అందుబాటులో ఉన్నాయి.

వీటివల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉన్నప్పటికీ వీటి వల్ల కలిగే మేలు ఎక్కువ కాబట్టి వైద్య నిపుణులు ఈ చికిత్సలను చేస్తూ వస్తున్నారు. అయితే దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు దీనికి భిన్నంగా ఆలోచించారు. సాధారణ కణాలు క్యాన్సర్ కణాలుగా మారాక చికిత్స చేసే కంటే అసలు అవి ఎందుకు క్యాన్సర్ కణాలుగా మారుతున్నాయో గుర్తించి, అలా మారకుండా అడ్డుకునే ప్రయత్నాలను ప్రారంభించారు. పెద్ద పేగు క్యాన్సర్ కు సంబంధించిన కణాలను సేకరించి వాటితో ప్రయోగశాలలో చిన్న చిన్న కణితులను అభివృద్ధి చేశారు. సాధారణ కణాలు క్యాన్సర్ కణాలుగా మారేలా చేసే ప్రోటీన్లను నాశనం చేసే వ్యవస్థ పని చేయకుండా అడ్డుకుంటున్న ఎంజైమును గుర్తించారు. ల్యాబ్ లో పెంచిన ఆర్గనైడ్లలో ఆ ఎంజైమ్ ను నిరోధించారు. అంతే ఆ క్యాన్సర్ కణాల (ఆర్గనాయిడ్ల) పెరుగుదల ఆగడమే కాకుండా అవి మళ్లీ సాధారణ కణాలుగా మారాయని వారు వెల్లడించారు. ప్రస్తుతానికి ప్రయోగశాల దశలో ఉన్న ఈ చికిత్స భవిష్యత్తులో క్యాన్సర్ ట్రీట్మెంట్ గతినే మార్చేస్తుందని అమెరికాకు చెందిన ప్రముఖ అంకాలజిస్ట్ డాక్టర్ టిఫినీ వెల్లడించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్