తమలపాకు తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఆయుర్వేదం చెప్తున్న మాట ఇది

హిందూ సంప్రదాయంలో తమలపాకుకు విశిష్ఠమైన స్థానం ఉంది. భోజనం చేసిన తర్వాత చాలామంది తాంబూలంగా తమలపాకును తింటారు. తమలపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.

betel leaf

ప్రతీకాత్మక చిత్రం 

హిందూ సంప్రదాయంలో తమలపాకుకు విశిష్ఠమైన స్థానం ఉంది. భోజనం చేసిన తర్వాత చాలామంది తాంబూలంగా తమలపాకును తింటారు. తమలపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిని పాన్ అని కూడా అంటారు. ఆయుర్వేదంలో అనేక వ్యాధులను నయం చేయడానికి తమలపాకును వాడుతారు. దీని చరిత్ర సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం నాటిది. వివిధ మత గ్రంథాలో, పురాణాలలో కూడా తమలపాకు పాత్ర ఎంతగానో ఉంది. పెళ్లికైనా,పేరంటానికైనా, వ్రతలకైనా, పూజలకైనా తమలపాకుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. తమలపాకులో యాంటీ టాక్సిక్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ డయాబెటిక్, యాంటీ ఇన్ప్లమేటరీ, యాంటీ క్యాన్సర్, యాంటీ అల్సర్ లక్షణాలు ఉన్నాయి. తమలపాకును తిన్నా, తమలపాకు టీ తాగినా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ప్రతి రోజు ఉదయం తమలపాకు తింటే నోటి దుర్వాసన, క్యాన్సర్ లాంటివి అదుపులో ఉంటాయి. తమలపాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద డాక్టర్లు విశ్లేషించారు. 

తమలపాకు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

- ప్రతి రోజు తమలపాకును మిరియాలతో కలిపి తీసుకుంటే ఒంట్లో కొవ్వు మొత్తం కరిగిపోతుంది. 

- తమలపాకు తినడం వల్ల చర్మవ్యాధులు తగ్గుతాయి. 

- చిన్న పిల్లలకు తమలపాకు మంచి ఆయుర్వేద మందుగా చెప్పుకోవచ్చు. జలుబు, దగ్గు నుంది ఉపశమనం చెందవచ్చు.

- రక్తనాళాలలో పేరుకుపోయిన కొవ్వును దూరం చేస్తుంది.

- మధుమేహరోగులకు తమలపాకు పొడి బాగా ఉపయోగపడుతుంది.

- రక్తంలో గ్లూకోజ్ స్థాయిని అదుపులో ఉంచుతుంది.

- తమలపాకు తీసుకోవడం వల్ల పురుషుల్లో టెస్టోస్టిరాన్  ఉత్పత్తి పెరుగుతుంది. 

- భోజనం చేసిన తర్వాత తమలపాకును తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్