Cough Remedies | దగ్గు తగ్గేందుకు అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలు

దగ్గు నుంచి ఉపశమనం పొందేందుకు ఇంట్లోనే పలు రకాల ఆయుర్వేద మందులు, వంటింటి చిట్కాలతో స్వాంతన చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

cough remedies

ప్రతీకాత్మక చిత్రం

దగ్గు నుంచి ఉపశమనం పొందేందుకు ఇంట్లోనే పలు రకాల ఆయుర్వేద మందులు, వంటింటి చిట్కాలతో స్వాంతన చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. 

- దగ్గుకి మంచి మందు క్యాబేజీ. క్యాబేజీ ఆకులను నమిలినా లేదా క్యాబేజీ ఆకుల రసం తీసి తాగినా దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు. రసాన్ని నేరుగా కాకుండా చిటికెడు పంచదార వేసుకోని కూడా కలుపుకోవచ్చు. తీవ్రతని బట్టి రోజుకు రెండు, మూడు సార్లు తీసుకోవచ్చు.  దగ్గు రాత్రిళ్లు ఎక్కువగా బాధిస్తు్ంది కాబట్టి పడుకునే ముందు తప్పకుండా తాగాలి.

- ధనియాలు, మిరియాలు, అల్లం వేసి బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిన కషాయాన్ని తాగినా దగ్గు తగ్గుతుంది.

- లవంగం లేదా ఒక చిన్న కాకరకాయ ముక్క పడుకునే ముందు బుగ్గన పెట్టుకోని పడుకుంటే రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్రపోవచ్చు.

- సొంటి కషాయంలో కాని లేక అల్లం రసంలో కాని కలుపుకోని తీసుకోవటం ద్వారా దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు.

- ఉమ్మెత్త ఆకులను ఎండలో ఎండనివ్వాలి. ఎండిన ఆకులను చుట్టలా చుట్టి దాని పొగ తాగితే దగ్గు, ఆయాసం తగ్గుతుంది.

- ఒక కప్పు గోరువెచ్చని నీటిలో సగం టీ స్ఫూన్ పసుపు, సగం టీ స్పూన్ ఉప్పు కలిపి ఆ నీళ్లను నోట్లో పోసుకొని పుకిలించడం వలన దగ్గు నుండి ఉపశమనం చెందవచ్చు.

- రెండు చెంచెల తేనెను ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి తాగటం వల్ల దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది.

గమనిక : ఈ సమాచారం నిపుణుల ద్వారా సేకరించినది మాత్రమే. ఈవార్తలు.కామ్‌కు ఎలాంటి సంబంధం లేదు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్