Benefits of Mehendi for Hair: మెరిసే జుట్టు కోసం బ్రాండెడ్ షాంపూ అవసరం లేదు..ఇదొక్కటి ఉంటే చాలు

మీ జుట్టు బలంగా, మెరిసేలా ఉండాలనుకుంటే.. హెన్నాను అప్లై చేయడం వల్ల మీ జుట్టు బలంగా ఉంటుంది. మెహందీ జుట్టును దృఢంగా, మందంగా, అందంగా చేస్తుంది. మెహందీని అప్లై చేయడం వల్ల జుట్టుకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం.

Benefits of Mehendi for Hair

ప్రతీకాత్మక చిత్రం 

మెహందీని చేతులకే కాదు.. జుట్టుకు కూడా ఉపయోగిస్తారు. అమ్మమ్మలు కూడా జుట్టును అందంగా మార్చుకోవడానికి హెన్నాను వాడేవారు. మెహందీ జుట్టుకు చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు. దీన్ని అప్లై చేయడం వల్ల జుట్టు స్ట్రాంగ్ గా, షైనీగా మారి చాలా అందంగా కనిపిస్తుంది. అందుకే హెన్నాను జుట్టుకు పట్టించే ట్రెండ్ చాలా కాలంగా కొనసాగుతోంది. హెన్నాను జుట్టు మీద అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి  తెలుసుకుందాం.

జుట్టు కోసం హెన్నా  ప్రయోజనాలు:

తెల్ల వెంట్రుకలను దాచుకోవడానికి మెహందీ ఒక సహజ మార్గం. దీన్ని అప్లై చేయడం వల్ల జుట్టుకు ఎలాంటి నష్టం జరగకుండా తెల్లజుట్టు కనిపించకుండా ఉంటుంది. రసాయనాలు లేని కారణంగా, జుట్టు పొడిగా, నిర్జీవంగా మారదు. అందువల్ల, తెల్లటి జుట్టును కవర్ చేయడానికి, పార్లర్ నుండి రంగు వేయడానికి బదులుగా హెన్నాను అప్లై చేయడం మంచి ఎంపిక. దీనికోసం హెన్నాలో టీ లీఫ్ వాటర్ వేసి ఇనుప పాత్రలో కరిగించి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం, హెన్నాను జుట్టుకు బాగా పట్టించి, కాసేపు ఆరనివ్వండి. దీని తర్వాత చల్లటి నీటితో కడగాలి.

జుట్టును మృదువుగా చేస్తుంది:

పొడి, నిర్జీవమైన జుట్టు అస్సలు అందంగా కనిపించదు. ఈ సమస్యను అధిగమించడానికి, హెన్నాను అప్లై చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. మెహందీ జుట్టును మృదువుగా మార్చడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇది జుట్టుకు మెరుపును తెచ్చి, శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అందువల్ల, మీ జుట్టు మెరిసేలా, మృదువుగా చేయడానికి హెన్నాను అప్లై చేయండి. కావాలంటే ఉసిరి పొడిని కూడా ఇందులో వేసుకోవచ్చు.

జుట్టు బలంగా మారుతుంది

మెహందీ జుట్టును ఆరోగ్యంగా,ఒత్తుగా మార్చడంలో సహాయపడుతుంది. జుట్టుకు బలాన్ని ఇవ్వడంతో పాటు అందంగా కూడా తయారవుతుంది. కావాలంటే మెహందీకి గుడ్డు కూడా వేసి అప్లై చేసుకోవచ్చు. గుడ్డులోని తెల్లసొనలో ప్రొటీన్ ఉంటుంది. ఇది జుట్టును అందంగా మార్చడంలో సహాయపడుతుంది.

చుండ్రు తగ్గుతుంది: 

చుండ్రు జుట్టు మూలాలను బలహీనపరుస్తుంది, దీని కారణంగా జుట్టు రాలడం, విరిగిపోతుంది. అంతే కాదు, చుండ్రు కారణంగా జుట్టు కూడా దురదగా మారుతుంది. అవి భుజాల మీద పడుతూనే  చాలా అసహ్యంగా కనిపిస్తుంది. అందుకే ఈ సమస్య నుంచి బయటపడాలంటే హెన్నాను అప్లై చేయండి. అందువల్ల, చుండ్రు సమస్యను తొలగించడానికి, హెన్నాను జుట్టుకు రాయండి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్