ప్రకృతి ప్రసాదిత మునగాకులో విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఏ ఇతర ఆకులలో లేనివిధంగా మునగాకులో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పాస్పరస్, జింక్ పుష్కలంగా కనిపిస్తాయి.
ప్రతీకాత్మక చిత్రం
ప్రకృతి ప్రసాదిత మునగాకులో విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఏ ఇతర ఆకులలో లేనివిధంగా మునగాకులో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పాస్పరస్, జింక్ పుష్కలంగా కనిపిస్తాయి. వేల సంవత్సరాల క్రితమే మునగాకును మెడిసిన్‌లో వాడేవారు అంటే దాని గొప్పతనం ఏంటి? అని తెలుసుకోవచ్చు. ఈ మునగాకును దక్షిణాఫ్రికాలో ఎక్కువగా సాగు చేస్తారు. అనేక ఔషధ గుణాలు ఉన్న మునగాకు రసం తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటంటే..
మునగాకు రసం అత్యధిక పోషకాలతో నిండి ఉంటుంది.
4 గ్లాసుల పాలలో లభించే కాల్షియం ఒక గ్లాస్ మునగాకులో ఉంటుంది.
7 ఆరెంజ్లలో ఉండే విటమిన్ సి ఒక గ్లాస్ మునగాకులో లభిస్తుంది.
7 అరటిపళ్ళలో ఉండే పొటాషియం ఒక గ్లాస్ మునగాకులో ఉంటుంది.
పాలకూరతో పోలిస్తే 25 రెట్లు ఎక్కువగా ఐరన్ ఉంటుంది.
క్యారెట్లతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా విటమిన్ ఏ ఉంటుంది.
పిల్లలు తినే ఆహారంలో మునగాకును చేరిస్తే వాళ్లకు ఎముక బలం పెరుగుతుంది.
శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడేవారు మునగాకును తరచూ తీసుకుంటే మంచిది. ఇది శరీరంలో వ్యర్థాలను తేలిగ్గా బయట పంపుతుంది.