ఉప్పు మన శరీరానికి చాలా ముఖ్యమైన పదార్థం. స్నానానికి ఉప్పునీటిని ఉపయోగించడం వల్ల శారీరక , మానసిక ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యలు నయమవుతాయి.
ప్రతీకాత్మక చిత్రం
ఉప్పు మన శరీరానికి చాలా ముఖ్యమైన పదార్థం. స్నానానికి ఉప్పునీటిని ఉపయోగించడం వల్ల శారీరక , మానసిక ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యలు నయమవుతాయి. ఉప్పునీటి స్నానం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. ఉప్పులో మెగ్నీషియం, కాల్షియం , సోడియం ఉంటాయి. ఈ కారకాలు శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తాయి. ఉదయాన్నే ఉప్పునీటి స్నానం చేయడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. స్నానం చేసే వెచ్చని నీటిలో 5 గ్రాముల ఉప్పును ఉపయోగించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. నీటిలో ఉప్పు బాగా కరిగిన తర్వాత ఆ నీటితో స్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఉప్పు నీటితో స్నానం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి:
ఉప్పునీటి స్నానం చేయడం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ నొప్పి తగ్గుతుంది. చర్మ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. ఉప్పునీటిలో స్నానం చేయడం వల్ల చర్మం శుభ్రపడుతుంది. అలాగే ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది. ఉప్పు నీరు చర్మాన్ని కాంతివంతంగా , మృదువుగా చేస్తుంది. గోరువెచ్చని నీళ్లలో ఒక టీస్పూన్ ఉప్పు కలిపి ఆ నీటితో స్నానం చేస్తే స్కిన్ ఇన్ఫెక్షన్ దూరమవుతుంది. చెమట వల్ల కలిగే అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.
నొప్పి, వాపు తగ్గించడానికి సహాయపడుతుంది:
వెచ్చని ఉప్పు నీటిలో స్నానం చేయడం వల్ల నొప్పి , వాపు తగ్గుతుంది. గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ ఉప్పు కలిపి తలస్నానం చేస్తే కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. గోరువెచ్చని నీళ్లలో ఎప్సమ్ సాల్ట్ కలుపుకుని స్నానం చేస్తే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
ఉప్పునీటిలో స్నానం చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఉప్పు నీటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. కాబట్టి ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఉప్పు నీరు మీ ఒత్తిడి , అలసట నుండి ఉపశమనానికి సహాయపడుతుంది. ఉప్పు నీటి స్నానం మంచి నిద్రకు దారి తీస్తుంది. మంచి నిద్ర కోసం, శరీరంలో మెగ్నీషియం సరైన మొత్తంలో ఉండాలి. మెగ్నీషియం శరీరంలో సెరోటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచి మంచి నిద్రకు దారి తీస్తుంది.
శరీరాన్ని డీటాక్స్ చేయడంలో సహాయపడుతుంది:
ఉప్పు నీళ్లలో స్నానం చేయడం వల్ల శరీరం డిటాక్స్ చేస్తోంది. ఉప్పు శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. గోరువెచ్చని నీటిలో ఉండే ఎప్సమ్ సాల్ట్ శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపుతుంది.
ఉప్పు నీటి వల్ల కలిగే నష్టాలు:
ఉప్పు నీటికి కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఉప్పు నీటిని దీర్ఘకాలికంగా ఉపయోగించడం వల్ల రక్తంలో మెగ్నీషియం , సల్ఫేట్ పరిమాణం పెరుగుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే ఉప్పునీటితో ఎక్కువగా స్నానాలు చేయడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. ఇది శ్వాస సమస్యలు, రక్తపోటు, అతిసారం, వికారం , తలనొప్పికి కూడా కారణమవుతుంది.