బార్లీ ప్రతిరోజు తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు చెక్ చెప్పేందుకు అవకాశం ఉంది. బార్లీతో ఆరోగ్యంగా ఉండడంతోపాటు అనేక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. బార్లీని తీసుకోవడం వలన జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. బార్లీలో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యల నుంచి పూర్తిగా ఉపశమనం కలిగిస్తుంది. శరీరంలోని మలినాలను తొలగించడంలోనూ బార్లీ కీలక పాత్ర పోషిస్తుంది.
బార్లీ గింజబార్లీ గింజలు
బార్లీ ప్రతిరోజు తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు చెక్ చెప్పేందుకు అవకాశం ఉంది. బార్లీతో ఆరోగ్యంగా ఉండడంతోపాటు అనేక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. బార్లీని తీసుకోవడం వలన జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. బార్లీలో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యల నుంచి పూర్తిగా ఉపశమనం కలిగిస్తుంది. శరీరంలోని మలినాలను తొలగించడంలోనూ బార్లీ కీలక పాత్ర పోషిస్తుంది. బాడీ డిటెక్స్ ఫై చేయడంలోను బార్లీ భూమిక పోషిస్తుందని చెప్తున్నారు. బార్లీని వివిధ రూపాల్లో తీసుకుంటే సులభంగా బరువు తగ్గవచ్చు. బార్లీలోని ఫైబర్ కడుపు నిండిన ఫీల్ అందిస్తుంది. బార్లీ తింటే కొలెస్ట్రాల్ కరుగుతుంది. డీహైడ్రేషన్ సమస్య నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. నిత్యం హైడ్రేట్ గా ఉండేందుకు బార్లీ తీసుకుంటే చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజు బార్లీ తీసుకోవడం వల్ల కిడ్నీల పని తీరు మెరుగుపడుతుంది. కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. కిడ్నీ సమస్యల నుంచి దూరంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. బార్లీలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. బార్లీ తీసుకోవడం వల్ల రాడికల్స్ నుంచి రక్షించుకోవచ్చు. బార్లీని తీసుకోవడం వలన ఆరోగ్యంతోపాటు చర్మ సౌందర్యం కూడా పెరుగుతుంది. చర్మ సమస్యలు పూర్తిగా దూరం అవుతాయి. బార్లీ వేసవిలో తీసుకుంటే బాడీ టెంపరేచర్ తగ్గుతుంది. శరీరాన్ని చల్లగా మార్చడంలో బార్లీ సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండేందుకు కూడా ఇది ఎంతగానో దోహదం చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. బార్లీ తింటే డయాబెటిస్ నుంచి దూరంగా ఉండవచ్చు.
బార్లీని ఎలా తీసుకోవచ్చు అంటే..
పావు కప్పు బార్లీ గింజలను రెండున్నర లీటర్లలో నీళ్లకు కలిపి సగం నీళ్లు మిగిలేంత వరకు మరిగించి దించి వడపోసుకుని తాగాలి. రెండు రోజులపాటు చేస్తే పేగులు పనితీరు మెరుగవుతుంది. వాపులతో కూడిన జ్వరాల్లో బార్లీని ఆహార ఔషధంగా వాడవచ్చు. చిన్నపిల్లలకు బార్లీని నీళ్ళతో గాని లేదా పండ్ల రసంతో గాని కలిపి ఇవ్వవచ్చు. జ్వరం, నీరసంతో ఉంటే బార్లీ కషాయానికి గ్లూకోజ్ కలిపి తీసుకుంటే వెంటనే శక్తి వస్తుంది. బార్లీ గింజలతో గంజిని తయారు చేసి మజ్జిగ, నిమ్మరసాన్ని కలిపి తీసుకుంటే మూత్ర సంబందిత వ్యాధుల్లో అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. నెఫ్రైటిస్, సిస్టైటిస్ వంటి సమస్యల్లో సైతం ఉపయుక్తంగా ఉంటుంది. మూత్ర విసర్జన కష్టంగా ఉంటే బార్లీ కషాయానికి బెల్లం, నిమ్మరసం కలిపి తీసుకోవచ్చు. బాలింతల్లో పాలు తక్కువగా పడితే బార్లీని నీళ్లతో కలిపి తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. బార్లీని నీళ్లలో నానబెట్టి రోజు తాగితే శరీరానికి పట్టిన నీరు తగ్గుతుంది. ఒంటికి నీరు చేరిన గర్భిణి స్త్రీలు బార్లీ నీటిని తాగడం వల్ల చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బార్లీని రవ్వలాగా మెత్తటి పిండిలా చేసి దానితో పలహారాలు చేసుకుంటే త్వరగా తేలిగ్గా జీర్ణం అవుతాయి. బార్లీ నుండి తీయబడిన నూనెను వాడితే శరీరంలోని కొలెస్ట్రాల్ శాతం తగ్గుతుంది. బార్లీలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. పిల్లలకు ఇచ్చే సూపుల్లో, పాలల్లో బార్లీ వాడడం ద్వారా వారి ఎదుగుదలకు, ఆరోగ్యానికి, శక్తికి దోహదం చేస్తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
