కొందరు పురుషులు శృంగారాన్ని ఆస్వాదించలేరు. దానికి కారణాల్లో ప్రధానమైంది.. ప్రి మెచ్యూర్ ఎజాక్యులేషన్ (Premature Ejaculation). ఎప్పుడైతే వీర్యం తొందరగా విడుదల అవుతుందో ఆ సమస్యను ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు.
ప్రతీకాత్మక చిత్రం
కొందరు పురుషులు శృంగారాన్ని ఆస్వాదించలేరు. దానికి కారణాల్లో ప్రధానమైంది.. ప్రి మెచ్యూర్ ఎజాక్యులేషన్ (Premature Ejaculation). ఎప్పుడైతే వీర్యం తొందరగా విడుదల అవుతుందో ఆ సమస్యను ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. ఈ సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. అసలు ఎవరికి చెప్పాలో అర్థం కాని స్థితిలో ఉంటారు. ఎలాంటి వైద్యం తీసుకోవాలో తెలియక సతమతం అవుతుంటారు. కొంతమంది డాక్టర్‌ని కన్స్‌సల్ట్ అవుతే కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తారు. కానీ, కొందరికి పనిచేస్తాయి, కొందరికి పనిచేయవు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీనికి పరిష్కారం ఏంటి? అనే విషయాలు తెలుసుకుందాం.
పురుషులు శృంగారంలో ఎక్కువసేపు పాల్గొనాలని తహతహలాడిపోతుంటారు. వీర్యం పడిపోకుండా ఉండటానికి రోజుకొక ట్రిక్ పాటిస్తుంటారు. కానీ అవన్నీ వర్క్ అవుట్ కాక సతమవుతుంటారు. పురుషుడు పూర్తి ఆరోగ్యంగా ఉండి, శృంగార కోరికలు బాగా ఉన్నా.. వచ్చే సమస్యంతా శ్రీఘ్రస్కలనమే. ఇలాంటి సమస్య చాలా మంది పురుషులను వేధిస్తుంది. దీనివల్ల పురుషులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతుంటారు. శృంగారం చేసే సమయంలో కొన్ని పాటించాల్సిన నియమాలను పాటిస్తే వీర్యం త్వరగా స్కలనం కాకుండా ఉంటుంది. వీర్యం త్వరగా స్కలనం కాబోతుందని అనిపిస్తే వీర్యం స్కలనం వల్ల పురుషుడు భావప్రాప్తి పొందుతాడు.. కానీ స్త్రీ పొందదు.
అందువల్ల స్పర్శతోనే స్త్రీని శృంగార అనుభూతికి గురిచేయాలి. శృంగారం చేసేటప్పుడు ఎలాంటి ఆందోళన, అభద్రత భావానికి లోను కాకుడదు. ఎంతవరకు స్పందించాలి? ఏయే పనులు చేయకూడదనే ముందుగా తెలుసుకోవాలి. శృంగారం చేసే సమయంలో వీర్యం త్వరగా స్కలనం అవుతుందని అనిపిస్తే వెంటనే స్ట్రోక్స్‌ను అపివేయాలి. మళ్లీ కొద్దిసేపు తర్వాత మరలా ప్రయత్నించాలి. కొందరి పురుషుల్లో వీర్యం తొందరగా రావటానికి నాలుగు కారణాలు ఉన్నాయి. 1. భయం, 2. ఎగ్జైట్‌మెంట్, 3. హర్మోనల్ ఇంబ్యాలెన్స్, 4. ఇన్ఫెక్షన్. ఇలాంటి సమస్య కలిగిన పురుషులు వైద్యనిపుణులను కలిసి వారి సలహాలు తీసుకోవటం మేలు.