ఆయుర్వేదమే సలాం కొట్టింది.. కొవ్వు కొలెస్ట్రాల్ లేని అద్భుతం తేనె

పురాతన కాలం నుండి ప్రజలు ఉపయోగిస్తున్న పదార్థాలలో తేనె ఒకటి. ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే తేనెను చాలా రకాలుగా ఆరోగ్య, ఇతర పనులకు వినియోగించి సత్పలితాలు పొందవచ్చు.

honey benefits

ప్రతీకాత్మక చిత్రం 

పురాతన కాలం నుండి ప్రజలు ఉపయోగిస్తున్న పదార్థాలలో తేనె ఒకటి. ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే తేనెను చాలా రకాలుగా ఆరోగ్య, ఇతర పనులకు వినియోగించి సత్పలితాలు పొందవచ్చు. అంతటి సత్ఫలితాలు కలిగిన తేనెను మన నిత్య జీవితంలో ఎక్కువగా వాడకుండా దూరం పెడుతున్నాం. చక్కెర అందుబాటులో ఉండటం వల్ల తేనెను పక్కన పెట్టి శరీరానికి వివిధ పోషకాలు అందకుండా మనమే అడ్డుకుంటున్నాం.తేనెలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. తేనెను నిత్యం  తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచమంతా లభించే ఆరోగ్యకరమైన ఆహారంలో తేనె ఒకటి. వివిధ ఔషద గుణాలు కలిగిన అద్భుతమైన వనరుగా చెప్పుకోవచ్చు. సహజమైన తేనె స్పస్టమైన బంగారు వర్ణంలో లభిస్తుంది. తేనెలో సాధారణంగా కార్బోహైడ్రెడ్స్, సహజ చక్కెరలు ఉంటాయి. గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అధికంగా ఉండటం వల్ల తియ్యగా ఉంటుంది.

తేనెలో కొవ్వు, కొలెస్త్రాల్ ఉండదు. ప్రొటీన్స్, ఫైబర్‌తో పాటు క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, జింక్ వంటి ఖనిజాల లవణాలు, విటమిన్ బీ2, విటమిన్ బీ3,  విటమిన్ బీ6, విటమిన్ బీ9, విటమిన్ సీ కూడా లభిస్తాయి. తేనెలో రెండు రకాలు ఉంటాయి. అవి రా హనీ, ప్రాసెస్‌డ్ హనీ. రా హనీ అంటే డైరెక్ట్‌గా తేనె తెట్టెలో నుంచి తీసిన తేనె. ప్రాసెస్‌డ్ హనీ అంటే మార్కెట్‌లో అమ్మేవి. దీన్ని హీటింగ్ ట్రీట్‌మెంట్, ఫిల్‌ట్రేషన్ ట్రీట్మెంట్ చేసి మనకు అమ్ముతారు. ఎప్పుడైన రా హనీ తీసుకుంటేనే మంచిది.

రా హనీలో చాలా మినరల్స్ ఉంటాయి. తేనెలోని పోషకాలు ఔషధ లక్షణాలుగా దానిని లిక్విడ్ గోల్డ్ అని కూడా అంటారు. తేనెతో ఎన్నో ఆరోగ్య ఫలితాలను పొందవచ్చు. ముఖ్యంగా బరువు తగ్గడానికి, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి  ఉపయోగపడుతుంది. తేనెలో యాంటిసెప్టిక్, యాంటిబాక్టీరియా లక్షణాలు కలిగి ఉండి జీర్ణవ్యవస్థను నియంత్రిస్తుంది. పర్యవరణం వల్ల ఎదురయ్యే శరీర ఎలర్జీకి చెక్ పెడుతుంది. చర్మ సౌందర్యానికి తేనె చాలా చక్కగా పనిచేస్తుంది.


క్రీడలతో చదువులో చురుకు: సైనానెహ్వాల్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్