ఆస్తమా రాకుండా ఉండాలంటే?

మనలో చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యలలో ఆస్తమా ఒకటి. ఇది శ్వాసకోశ వ్యాధి. ఆస్తమా అనేది ప్రాణాంతక వ్యాధి కానప్పటికీ..ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలు పోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

asthma

ప్రతీకాత్మక చిత్రం 

మనలో చాలా మంది  ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యలలో ఆస్తమా ఒకటి. ఇది శ్వాసకోశ వ్యాధి. ఆస్తమా అనేది ప్రాణాంతక వ్యాధి కానప్పటికీ..ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలు పోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆస్తమా గురించి అవగాహన కల్పించేందుకు, ప్రతి సంవత్సరం మే 7వ తేదీని 'ప్రపంచ ఆస్తమా దినోత్సవం'గా పాటిస్తారు. ప్రత్యేకించి కారణం, సకాలంలో చికిత్సను తీసుకున్నట్లయితే.. బాధిత వ్యక్తి దాని నుండి బయపపడవచ్చు.కొన్ని ఆహారాలు ఆస్తామాను తగ్గిస్తాయి. వాటిలో పండ్లు, కూరగాయలు, బీటా కెరోటిన్, విటమిన్ ఇ, సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ కణాలను అడ్డుకుంటాయి. ఊపిరితిత్తులకు మంట చికాకకు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఆస్తమా ముప్పును తప్పించేందుకు ఆహారాలు తగినట్లుగా లేవు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు వీలుగా పోషకాలను, విటమిన్లను తీసుకోవడం చాలా అవసరం. 

విటమిన్ డి: 

సూర్యరశ్మి నుంచి విటమిన్ డిని మనం పొందవచ్చు. కానీ కొన్ని ఆహారాల్లో కూడా విటమిన్ డి లభిస్తుంది. సాల్మన్, స్వోర్డ్ ఫిష్ వంటి కొవ్వు చేపలు, పాలు, గుడ్లు, నారింజ జ్యూస్ లో వీటిని ఎక్కువగా తీసుకుంటే విటమిన్ డి అందుతుంది. విటమిన్ డి లెవల్స్ శరీరంలో తక్కువగా ఉంటే ఆస్తమా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 

గింజలు: 

విటమిన్ ఇ ఆస్తమాకు మేలు చేస్తుంది. బాదం, హాజెల్ నట్స్, పచ్చిగింజల్లో ఉంటుంది. అలాగే బ్రోకలీ, కాలే, క్రూసిఫెరస్ వంటి కూరగాయలు విటమిన్ ఇ లభిస్తుంది. ఇది దగ్గు, శ్వాసలో గురకను తగ్గిస్తుంది. 

డ్రైఫ్రూట్స్: 

ఆస్తమా ఉన్నవారు డ్రైఫ్రూట్స్ జోలికి వెళ్లకూడదు. ఎండిన పండ్లలో సల్పైట్స్ కొందరికి ఈ పరిస్థితిని మరింత పెంచుతుంది. వీటికి బదులుగా తాజా పండ్లు, ఆరెంజ్, యాపిల్స్ వంటి పండ్లు తీసుకుంటే ఆస్తమా తగ్గుతుంది. 

బీన్స్: 

కడుపు ఉబ్బినట్లుగా ఉండి..శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. బీన్స్ తింటే ఆస్తమా దాడిని పెంచుతుంది. 








సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్