తొక్కే కదా అని పడేస్తున్నారా.. అరటి పండు తొక్కతోను ఆరోగ్యానికి ఎంతో మేలు.!

ప్రతిరోజు అరటి పండు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందని నిపుణులు చెబుతుంటారు. అరటి పండులో మాత్రమే పోషకాలు ఉంటాయని చాలామంది భావిస్తుంటారు. అరటి పండును తినేసి తొక్కను అందరు పడేస్తుంటారు. కానీ, అరటిపండులోనే కాదు తొక్కలో కూడా పోషకాలు మెండుగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అరటి తొక్కలకు ఉన్న గొప్పతనం తెలిస్తే పొరపాటున కూడా అరటి తొక్కలను పారేసేందుకు కూడా ఎవరు ఇష్టపడరు.

Banana

అరటి పండు

అరటి పండు.. ప్రతి ఒక్కరూ తీసుకునే పండ్లలో ఇది తప్పనిసరిగా ఉంటుంది. వారంలో కనీసం రెండు మూడు సార్లైనా అరటి పండు తీసుకునేవారు ఎంతో మంది ఉంటారు. పిల్లల్లో బలహీనత తగ్గడానికి, కాళ్ల నొప్పులు తగ్గించేందుకు అరటి పండు ఎంతగానో దోహదం చేస్తుంది. ప్రతిరోజు అరటి పండు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందని నిపుణులు చెబుతుంటారు. అరటి పండులో మాత్రమే పోషకాలు ఉంటాయని చాలామంది భావిస్తుంటారు. అరటి పండును తినేసి తొక్కను అందరు పడేస్తుంటారు. కానీ, అరటిపండులోనే కాదు తొక్కలో కూడా పోషకాలు మెండుగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అరటి తొక్కలకు ఉన్న గొప్పతనం తెలిస్తే పొరపాటున కూడా అరటి తొక్కలను పారేసేందుకు కూడా ఎవరు ఇష్టపడరు. 

తొక్కలో ఉండే పోషకాలు ఇవే..

అరటి పండు తొక్కలో చర్మానికి, శరీరానికి, జుట్టుకు మేలు చేసే పోషకాలు మెండుగా ఉన్నాయి. అరటి తొక్కలో కెరోటినాయిడ్లు, పాలిఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరం నుంచి టాక్సిన్స్ ను బయటకు పంపించడంలో కీలక భూమిక పోషిస్తాయి. అరటిపండు తొక్కలో పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం ఉంటాయి. అరటి పండు తొక్కతో పళ్ళు రుద్దుకుంటే పళ్ళ మీద ఉండే పసుపు మరకలు పోతాయి. పళ్ళు ప్రకాశవంతంగా తెల్లగా మెరిసిపోతాయి. అరటిపండు తొక్కలో శర్మానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. అరటిపండు తొక్కతో ముఖంపైన మసాజ్ చేసినట్లయితే ముఖం నిగారింపును సొంతం చేసుకుంటుంది. కళ్ళ కింద వా, నల్లటి మచ్చలు, వృద్ధాప్య సంకేతాలు వంటి వాటిని అరటిపండు తొక్క ఈజీగా పోగొడుతుందని నిపుణులు చెబుతున్నారు. అరటి పండు తొక్కలో ఉండే ఇష్టమైన విటమిన్ సి, విటమిన్ ఈ,  జింక్ మొటిమలు, చర్మం దురద నుంచి కాపాడతాయి. చర్మం డ్రై కాకుండా తేమగా ఉండేలా చేస్తాయి. అరటి తొక్కను తేనె, నిమ్మరసంలో మిక్స్ చేసి అప్లై చేసుకుని పదినిమిషాల తర్వాత కడిగేస్తే మొఖం నిగారింపును సొంతం చేసుకుంటుంది. అరటి తొక్కలను జుట్టుకు రుద్దుకుంటే జుట్టుకు కావాల్సిన పోషకాలు అందుతాయి. అరటి తొక్కలను తింటే డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి అనేక వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అరటిపండు తొక్కలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల మల బద్ధకం సమస్యలను తొలగిస్తుంది. శరీరంలోని కొలెస్ట్రాలను తగ్గించడానికి, కంటి ఆరోగ్యం మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఎముకలను బలంగా ఉంచడానికి అరటి పండు తొక్క ఒకరిస్తుందని  నిపుణులు పేర్కొంటున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్