బ్యాక్ పెయిన్ వేధిస్తోందా.. ఈ చిట్కాలతో సమస్యకు పరిష్కారం.!

వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్న వారి సమస్య ఈ మధ్యకాలంలో పెరుగుతోంది. గతంలో వయసు పైబడిన వారిలో మాత్రమే ఈ సమస్య అధికంగా కనిపించేది. అయితే మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానం, ఎక్కువ సమయంపాటు వాహనంపై ప్రయాణించాల్సి రావడం, సిట్టింగ్ పొజిషన్ సరిగా లేకపోవడం వంటి అనేక కారణాలు వెన్నునొప్పి బారిన పడేందుకు కారణమవుతోంది. అయితే, ఈ వెన్ను నొప్పిని తగ్గించుకునేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి.

 symbolic image

ప్రతీకాత్మక చిత్రం

వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్న వారి సమస్య ఈ మధ్యకాలంలో పెరుగుతోంది. గతంలో వయసు పైబడిన వారిలో మాత్రమే ఈ సమస్య అధికంగా కనిపించేది. అయితే మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానం, ఎక్కువ సమయంపాటు వాహనంపై ప్రయాణించాల్సి రావడం, సిట్టింగ్ పొజిషన్ సరిగా లేకపోవడం వంటి అనేక కారణాలు వెన్నునొప్పి బారిన పడేందుకు కారణమవుతోంది. అయితే, ఈ వెన్ను నొప్పిని తగ్గించుకునేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఈ వెన్ను నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. ఆ చిట్కాలు ఏమిటో మీరు చూసేయండి. 

డెస్క్ జాబులు ఎక్కువగా చేయడం, కూర్చునే భంగిమ సరిగా లేకపోవడం వల్ల చాలామంది బ్యాక్ పెయిన్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి సమస్యలతో బాధపడే వారికి వెల్లుల్లి ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల బ్యాక్ పెయిన్ కంట్రోల్ అవుతుంది. వెల్లుల్లి ఆయలను కొబ్బరి లేదా లవంగాల నూనెతో కలిపి వేడి చేయాలి. ఈ నూనెతో మసాజ్ చేస్తే బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. అలాగే తులసి ఆకులను కలిపి నీటిలో మరిగించాలి. ఈ నీటిలో కొంచెం ఉప్పు వేసి తీసుకుంటే వెన్ను నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. హాట్ కంప్రెషన్ ఉపయోగించడం వల్ల బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. వెన్ను నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మెథడ్ ఫాలో అవ్వాలి. ఖాళీ కడుపుతో వెల్లుల్లి పేస్టు తినడం వల్ల బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. వెల్లుల్లిలోని పోషకాలు ఆరోగ్యాన్ని అందిస్తాయి.

ఐస్ ప్యాక్ అప్లై చేయడం వల్ల వాపు కంట్రోల్ అవుతుంది. వెన్ను నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కూడా కండరాలు దృఢంగా మారతాయి. వెన్నెముక బలంగా మారుతుంది. తద్వారా బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. నిద్రలేమి కూడా అనేక సమస్యలకు కారణం అవుతుంది. సౌకర్యవంతంగా ఉన్న బెడ్ మీద ఎనిమిది గంటలు నిద్రపోతే బ్యాక్ పెయిన్ కంట్రోల్ అవుతుంది. కొన్ని రకాల బ్రీతింగ్ వ్యాయామాలు కూడా బ్యాక్ పెయిన్ తగ్గుముఖం పట్టడానికి దోహదం చేస్తాయి. బ్రీతింగ్ వ్యాయామాలు చేయడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ చిట్కాలు పాటించడం ద్వారా కొద్ది రోజుల్లోనే బ్యాక్ పెయిన్ నుంచి విముక్తి పొందవచ్చు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్