ప్రతి మహిళకు మాతృత్వం అనేది ఒక వరం లాంటిది. అమ్మ కావాలని ప్రతి మహిళా కోరుకుంటుంది. అటువంటి శుభ ఘడియల కోసం నిరీక్షించే మహిళలు ఎంతోమంది ఉంటారు. అయితే, గర్భం దాల్చిన తరువాత చాలా మంది మహిళలు తాము తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయించుకోవాల్సిన పరీక్షల పట్ల అవగాహన లేక మధ్యలోనే గర్భవిచ్చిన్నమై ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు.
గర్భం దాల్చిన మహిళ
ప్రతి మహిళకు మాతృత్వం అనేది ఒక వరం లాంటిది. అమ్మ కావాలని ప్రతి మహిళా కోరుకుంటుంది. అటువంటి శుభ ఘడియల కోసం నిరీక్షించే మహిళలు ఎంతోమంది ఉంటారు. అయితే, గర్భం దాల్చిన తరువాత చాలా మంది మహిళలు తాము తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయించుకోవాల్సిన పరీక్షల పట్ల అవగాహన లేక మధ్యలోనే గర్భవిచ్చిన్నమై ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. ఈ నేపథ్యంలో గర్భం దాల్చిన మహిళలు ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలన్న దానిపై అవగాహన అవసరమని నిపుణులు చెబుతున్నారు. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు కొన్ని మెడికల్ టెస్ట్ లు చేయించుకుంటే పుట్టబోయే బిడ్డకి, తల్లికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆయా టెస్టులను ఒకసారి పరిశీలిస్తే.. రూబెల్లా టెస్ట్ చేయించుకోవడం తప్పనిసరి. ఇది ఎక్కువగా పిల్లలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి గర్భధారణ సమయంలో సోకినట్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమస్య తీవ్రమైతే తల్లికి, బిడ్డకు ప్రాణాంతకం కావచ్చు. భార్యాభర్తలు ఇద్దరు తప్పనిసరిగా చేయించుకోవలసిన మరో ముఖ్యమైన పరీక్ష హెచ్ఐవి టెస్ట్.
ఈ పరీక్షలు కూడా తప్పనిసరిగా చేయించుకోవాలి. ఒకవేళ హెచ్ఐవి ఉంటే అది పిల్లలకు సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. గర్భిణీ చేయించుకోవలసిన మరో కీలక పరీక్ష హెపటైటిస్ బి. ఇది కూడా దీర్ఘకాలిక వ్యాధి. ఇది లివర్ హెల్త్ ను ప్రభావితం చేస్తుంది. క్యాన్సర్ ను ప్రమోట్ చేస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం అవుతుంది. కాబట్టి, కచ్చితంగా ఈ టెస్ట్ ని ప్రెగ్నెన్సీకి ముందు చేయించుకోవాలి. థైరాయిడ్ టెస్ట్ కూడా గర్భిణీ చేయించుకోవడం చాలా మంచిది. దీనికి తగిన మందులను వైద్యుల సూచనలు మేరకు వినియోగించాలి. ఈ పరీక్ష అనంతరం వైద్యులు చూసిన మేరకే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే, కంప్లీట్ బ్లడ్ టెస్ట్ లు కూడా చేయించుకోవడం మంచిది. దీనివల్ల ఎనీమియా ఉంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోకపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే బ్లడ్ లేకుంటే బేబీ ఎదుగుదలలో గ్రోత్ ఉండదు. ఇవి కాకుండా జెనెటిక్స్, బీపీ, షుగర్ వంటి మరికొన్ని పరీక్షలు చేయించుకోవాలని వైద్యుని పనులు సూచిస్తున్నారు. ఈ పరీక్షలు చేయించుకోవడం ద్వారా తల్లికి ఆరోగ్యవంతంగా, సుఖవంతమైన ప్రసవానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో పుట్టబోయే బిడ్డకు కూడా కొన్ని రకాల అనారోగ్య సమస్యలు బారిన పడకుండా కాపాడేందుకు అవకాశం ఉంటుంది వైద్యనిపుణులు చెబుతున్నారు. కాబట్టి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వడానికి ముందే ఈ తరహా పరీక్షలు చేయించుకోవడం ద్వారా చాలా వరకు మెరుగైన ఫలితాలను సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పరీక్షలు విషయంలో నిర్లక్ష్యం తగదని పేర్కొంటున్నారు. ప్రసవం అనంతరం పిల్లలకు కొన్ని రకాల వ్యాక్సిన్ లను తప్పిన సరిగా వేయించాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్ల విషయంలో కూడా తల్లిదండ్రుల అప్రమత్తతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది.