|| ప్రతీకాత్మక చిత్రం ||
ఉదయం లేవగానే పక్కన ఉన్నవారిని కూడా పలకరించం.. ఫోన్ పట్టుకొని దానిలో మునిగిపోతాం. రాత్రి పడుకునే వరకు ఫోన్‌లో ఇంటర్నెట్, సోషల్ మీడియాలోనో గడుపు అంటున్నారు. ఇలా ఫోన్ పట్టుకొని ఒకే దగ్గర కూర్చోవడం వల్ల మానసిక ఒత్తిడే కాకుండా అనారోగ్య సమస్యలను కోరి తెచ్చుకుంటున్నారు. దీనివల్ల శరీరం కూడా మొద్దు బారిపోతుంది, సోమరితనం మొదలవుతుంది. జీవితంలో ముందుకు సాగే ఆలోచన శక్తిని తగ్గిస్తోంది. రోజువారి దినచర్య కూడా మర్చిపోయి ఫోన్ కి అట్రాక్ట్ అయిపోతున్నారు.
దీనివల్ల కలిగే ఆరోగ్య సమస్యలు ఏంటి?
ఓకే దగ్గర కూర్చోడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగిపోయి గుండె జబ్బులకు దారితీస్తుంది.
మానసిక ఒత్తిడి, నిరాశ, బాధతో కుంగిపోవడం.
చెడు అలవాట్లకు దారితీస్తుంది.
ఆహార విషయంలో కూడా బద్ధకంతో జంక్ ఫుడ్ ఆర్డర్లు చేసుకొని తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందక రోగాలకు దారితీస్తుంది.
మానసిక ఒత్తిడి వల్ల బ్రెయిన్ పనితీరు తగ్గిపోతుంది.
మన రోజువారి దినచర్యను కోల్పోతాం. దీనివల్ల ముందుకు వెళ్లేందుకు ఆలోచించే శక్తి తగ్గిపోతుంది.
మానసిక ఒత్తిడి వలన చిరాకు వస్తుంది. దీనితో మంచి స్నేహితులను కూడా కోల్పోతాము.
నిద్రను కోల్పోతాం దీనివలన మనశ్శాంతిని కూడా కోల్పోవాల్సి వస్తుంది.
ఈ సమస్య నుండి బయటపడేందుకు ఏం చేయాలి?
మొదట ఫోన్ వాడకానికి టైమర్ సెట్ చేసుకోవాలి.
మనకు అవసరమైన దానికోసం టైంను ఉపయోగించుకొని డేటాను చూశాక ఫోన్ పక్కన పెట్టాలి.
వ్యాయామం, ధ్యానం కోసం టైం కేటాయించుకోవాలి.
నిద్రకు రోజు కనీసం 8 గంటల సమయం కేటాయించుకోవాలి.
రోజువారి దినచర్య కోసం షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుని సమయాన్ని వృధా చేయకుండా చూసుకోవాలి.
మనం తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ పెట్టి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి.