నిత్యం టీ తాగుతున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు

ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే వేడి వేడిగా కప్పు టీ తాగితే ఆ ఆనందం అంత ఇంతా కాదు. రోజు మొత్తం ఎంతో హుషారుగా, తాజాగా అనిపిస్తుంది. ఇందుకు కారణం టీ లో ఉండే కెఫిన్.

tea benefities

ప్రతీకాత్మక చిత్రం

ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే వేడి వేడిగా కప్పు టీ తాగితే ఆ ఆనందం అంత ఇంతా కాదు. రోజు మొత్తం ఎంతో హుషారుగా, తాజాగా అనిపిస్తుంది. ఇందుకు కారణం టీ లో ఉండే కెఫిన్. చాలామంది రోజులో లెక్కలేని సార్లు టీ తాగుతుంటారు. కానీ నెల పాటు టీ తాగడం మానేస్తే ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా?పూర్తి వివరాల్లోకెళితే.. మన దేశంలో దాదాపు 90 శాతం మందికి ఇష్టమైన పానీయం టీ. చాలామందికి ఉదయం లేవగానే టీ తాగాలనే కోరిక కలుగుతుంది. కొందరు అయితే లెక్కలేని సార్లు టీ తాగుతారు. ఎందుకంటే ఇది ఒకరకమైన శక్తిని, తాజాదనాన్ని ఇస్తుంది. తల నొప్పి, ఆందోళన ఎదైనా సరే అన్నింటికీ ఒకే ఒక్క పరిష్కారం టీ. కానీ మనం రోజు తాగే టీలోని చక్కెర కంటెంట్ ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది అనే విషయం మీకు తెలుసా? నెల రోజులుగా టీ తాగకపోవడం టీ ప్రియులకు నిజంగా పెద్ద సవాలే.  కానీ మీ ఆరోగ్యం దృష్ట్యా టీ తాగాలనే కోరికను అదుపు చేస్తే అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

సాధారణంగా మనం తాగే టీ లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇది క్యాలరీను పెంచుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం టీ లో చక్కెర అధికంగా ఉంటే జీర్ణవ్యవస్థను దెబ్బ తీస్తుంది. కాబట్టి ఒక నెలపాటు టీ తాగడం మానేయండి. మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు కూడా తగ్గుతారు. అనేక రకాల ఆరోగ్య సమస్యలు మీ దరిచేరవు. నెలపాటు టీ తాగకుండా ఉండటం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. తీపిగా ఉండే టీ తాగడం వల్ల చర్మంపై మొటిమలు, పొక్కులు ఏర్పడుతాయి. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే టీ తాగకపోవడం మంచిది. టీ తాగకపోతే శరీరంలో కెఫిన్ తగ్గుతుంది. ఇది బాగా నిద్రపోవడానికి సహయపడుతుంది. ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. సెల్ డ్యామేజ్, ఫ్రీ ర్యాడికల్‌ని కూడా తగ్గిస్తుంది. టీ తాగే అలవాటును మానుకోవడం వల్ల గుండెల్లో మంట, తల తిరగడం, గుండె కొట్టకునే వేగంలో హెచ్చుతగ్గులు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. చేతులు వణుకుతూ ఉంటే వెంటనే టీ తాగడం మానేయాలి.లేకపోతే సమస్య ఎక్కువతుంది. టీ తాగడం మానేస్తే అధిక రక్తపోటు సాధారణ స్తితికి వస్తుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్