తరచుగా కడుపు నొప్పి వేధిస్తోందా.? కడుపునొప్పి సమయంలో కనిపించే కొన్ని లక్షణాలు క్యాన్సర్ ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తరచూ వేధించే కడుపునొప్పి ప్రాణాంతకమైన క్యాన్సర్లలో ఒకటైన క్లోమ క్యాన్సర్ కావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. గడిచిన కొన్నానుగా ఈ క్యాన్సర్ చాలా వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ క్యాన్సర్ ను ప్రాథమిక దశలో గుర్తించడం కూడా చాలా కష్టం. పొట్టలో గ్రామ గ్రంధి జీర్ణాశయానికి కింది భాగంలో ఉంటుంది. బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేసే ఆహారం, హార్మోన్లను డైజెస్ట్ చేసే ఎంజైన్లను ఇది ఉత్పత్తి చేస్తుంది. ఇన్సులిన్ అనే హార్మోన్ ఇది ఉత్పత్తి చేస్తుంది.
ప్రతీకాత్మక చిత్రం
తరచుగా కడుపు నొప్పి వేధిస్తోందా.? కడుపునొప్పి సమయంలో కనిపించే కొన్ని లక్షణాలు క్యాన్సర్ ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తరచూ వేధించే కడుపునొప్పి ప్రాణాంతకమైన క్యాన్సర్లలో ఒకటైన క్లోమ క్యాన్సర్ కావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. గడిచిన కొన్నానుగా ఈ క్యాన్సర్ చాలా వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ క్యాన్సర్ ను ప్రాథమిక దశలో గుర్తించడం కూడా చాలా కష్టం. పొట్టలో గ్రామ గ్రంధి జీర్ణాశయానికి కింది భాగంలో ఉంటుంది. బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేసే ఆహారం, హార్మోన్లను డైజెస్ట్ చేసే ఎంజైన్లను ఇది ఉత్పత్తి చేస్తుంది. ఇన్సులిన్ అనే హార్మోన్ ఇది ఉత్పత్తి చేస్తుంది. ఆహారంలో ఉండే షుగర్ ను ఈ హార్మోన్ ప్రాసెస్ చేస్తుంది. కొన్ని రకాల పోషకాలు బాడీలో కలిసి డైజెస్టివ్ జ్యూసెస్ ను విడుదల చేస్తుంది. దీంట్లో ప్యాంక్రియాటిక్ డక్టల్ అడినోకార్సినోమా అత్యంత కామన్ గా వచ్చే క్యాన్సర్. ప్యాంక్రియాస్ నుంచి ఎంజైమ్స్ ను బయటకు తీసుకొచ్చే డక్ట్ గోడలో సెల్స్ అసాధారణ వృద్ధి వల్ల ఇది వస్తుంది. దీన్ని ప్రాథమిక దశలో గుర్తించడం చాలా కష్టం. ఇతర భాగాలకు పాకే వరకు దీన్ని కనిపెట్టడం సాధ్యం కాదు. అందుకే దీనిలో మరణం ముప్పు అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ క్యాన్సర్ లో ఉండే లక్షణాలు
ఈ క్యాన్సర్ బారిన పడిన వారిలో వెన్ను వరకూ పాకేలా పొట్టలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, పచ్చ కామెర్లు, మాళంలో మార్పు, డార్క్ కలర్ లో యూరిన్, దురద, డయాబెటిస్ లేదా అప్పటికే ఉంటే కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. చేతులు లేదా కాళ్లలో వాపులు, అలుపు, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇటువంటి లక్షణాలతో బాధపడేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పాంక్రియాటిక్ క్యాన్సర్ ఎందుకు వస్తుందో చెప్పడం చాలా కష్టం. ఈ ముప్పును పెంచే కొన్ని కారణాలను మాత్రం డాక్టర్లు చెబుతున్నారు. స్మోకింగ్, టైప్ టు డయాబెటిస్, ప్యాంక్రియాస్ లో దీర్ఘకాల ఇన్ఫ్లమేషన్, ఫ్యామిలీ హిస్టరీ, ఊబకాయం, వయసు మీద పడడం, ఆల్కహాల్ వల్ల దీని బారిన పడే అవకాశం ఉంది.
పాంక్రియాటిక్ క్యాన్సర్ బారిన పడ్డ వారిలో కేవలం 12 శాతం మంది మాత్రమే జీవిస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చికిత్స అందించిన ప్రాణానికి హామీ ఇవ్వలేరు. ఈ క్యాన్సర్ బారిన పడకుండా కొన్ని రకాల టీకాలు రావాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
పొట్టనొప్పి వస్తే నిర్లక్ష్యం వద్దు..
నిత్యం కడుపునొప్పి వేధిస్తుంటే మాత్రం నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కడుపులో నొప్పిని చాలామంది తేలిగ్గా తీసుకుంటారు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల వచ్చిన నొప్పిగా చాలామంది భావిస్తుంటారు. తరచూ ఇలా జరుగుతూ ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తున్నారు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వల్ల కూడా ఈ సమస్య ఉత్పన్నం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి నిత్యం కడుపునొప్పి వేధిస్తుంటే మాత్రం అప్రమత్తమై వైద్య నిపుణులు సంప్రదించాలని పేర్కొంటున్నారు.