వేసవి వస్తే కూల్‌డ్రింక్ తాగుతాం.. రకరకాల జ్యూస్‌లు తాగుతాం.. వర్షకాలం వచ్చిందంటే.. వేడి వేడి ఛాయ్‌ను సిప్ చేస్తాం. మరి శీతాకాలంలో? అసలే చలి.. పైగా తరుముకొచ్చే రోగాలు.. ఈ నేపథ్యంలో చలికాలంలోనూ ఓ అద్భుతమైన జ్యూస్ ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ప్రతీకాత్మక చిత్రం
వేసవి వస్తే కూల్‌డ్రింక్ తాగుతాం.. రకరకాల జ్యూస్‌లు తాగుతాం.. వర్షకాలం వచ్చిందంటే.. వేడి వేడి ఛాయ్‌ను సిప్ చేస్తాం. మరి శీతాకాలంలో? అసలే చలి.. పైగా తరుముకొచ్చే రోగాలు.. ఈ నేపథ్యంలో చలికాలంలోనూ ఓ అద్భుతమైన జ్యూస్ ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అదే ఉసిరి జ్యూస్. శీతాకాలంలో ఉసిరికాయలు విరివిగా దొరుకుతాయి. ఈ ఉసిరికాయలను అనేక మంది చాలా విధాలుగా వాడుతుంటారు. ముఖ్యంగా వంటల్లో, పచ్చడి రూపంలో, జ్యూస్ రూపంలో ఈ ఉసిరిని ఉపయోగిస్తుంటారు. అయితే ఉసిరి జ్యూస్‌ని పరగడుపున తాగితే మంచి ఫలితాల కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ జ్యూస్ తాగడం వల్ల మన శరీరంలో ఎలాంటి మార్పులు కలుగుతాయో తెలుసుకుందాం..
ప్రతిరోజు ఆహారాన్ని తీసుకోవడం సహజం. కానీ శరీరానికి కావాల్సిన పోషకాలను అందించే పదార్థాల్లో ఉసిరి ఒకటి. ఈ ఉసిరికాయతో పరగడుపున జ్యూస్ చేసుకొని తాగడం వల్ల శరీరంలో ఉండే కొవ్వు కరిగిపోతుంది. ఉసిరితో క్యాలరీలు తొందరగా తగ్గి అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. ఉసిరికాయలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో శీతకాలంలో వచ్చే జలుబు, దగ్గు, ఫ్లూ జ్వరం నుండి రక్షణ పొందవచ్చు. ఈ ఉసిరి జ్యూస్ తీసుకోవడం వల్ల జీర్ణసమస్యలు రావు. గ్యాస్, యాసిడిటి, మలబద్ధకం, అజీర్ణం వంటి వాటి నివరణకు ఈ ఉసిరి జ్యూస్ మంచి దివ్యౌషదం. ఈ జ్యూస్ వల్ల జీర్ణాశయ పేగులు శుద్ధి అయ్యి, వాటిలో ఉండే చెడు బ్యాక్టీరీయా నశిస్తుంది.
అంతేకాదు ఈ ఉసిరి జ్యూస్ వల్ల రక్తం శుద్ధి అవుతుంది. హిమోగ్లోబిన్ ఎర్ర రక్తకణాలను పెంచుతుంది. దృష్టి సమస్యలను పోగొట్టడంలో ఈ ఉసిరిలో ఉండే విటమిన్ సి, ఇతర పోషకాలు ఎంతగానో ఉపయోగపడుతాయి. డె సమస్యలను కూడా అరికడుతుంది ఈ జ్యూస్. క్యాన్సర్ కణాలు నశింపజేసే శక్తి ఉసిరిలో ఉంది. ముఖ్యంగా మధుమేహం ఈ ఉసిరి జ్యూస్ వల్ల తగ్గుతుంది. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నా ఈ ఉసిరి జ్యూస్ పరగడుపున తాగడం శరీరానికి చాలా మంచిది అని ఆరోగ్యవైద్య నిపుణులు వెల్లడించారు.