మనం తినే ఉప్పు చక్కెరలోనూ మైక్రో ప్లాస్టిక్స్ .. తాజా అధ్యయనంలో సంచలన విషయాలు

భారతదేశంలో దొరికే అన్ని బ్రాండ్ల ఉప్పు, అన్ని బ్రాండ్ల చక్కెరలు.. ప్యాక్ చేసి అమ్మినా.. ప్యాక్ చేయక లూజుగా అమ్మినా.. ప్లాస్టిక్ ముక్కలు కనిపిస్తున్నాయని టాక్సిక్స్ లింక్ అనే పర్యావరణహిత సంస్థ రిసెర్చ్ చేసి చెప్పింది.

sugar salt

ప్రతీకాత్మక చిత్రం

చికెన్ కొనటానికి వెళ్లినా కవర్.. కూరగాయలకు వెళ్లినా ప్లాస్టిక్ కవర్.. ఏ సామాను మోసుకొని రావాలన్న చేతిలో ప్లాస్టిక్ కవర్ ఉండాల్సిందే. అలా మన జీవితంలో నిత్యంగా మారిందీ ప్లాస్టిక్ భూతం. ఇప్పుడు మన ఆహారంలోనూ భాగం అవుతూ మనల్ని పట్టిపీడిస్తోంది. ఇంకో సంచలన విషయం ఏంటంటే.. మనం తినే ఉప్పు, చక్కెరలో కూడా ప్లాస్టిక్ చేరిపోయిందని తాజా అధ్యయనం బాంబ్ పేల్చింది. భారతదేశంలో దొరికే అన్ని బ్రాండ్ల ఉప్పు, అన్ని బ్రాండ్ల చక్కెరలు.. ప్యాక్ చేసి అమ్మినా.. ప్యాక్ చేయక లూజుగా అమ్మినా.. ప్లాస్టిక్ ముక్కలు కనిపిస్తున్నాయని టాక్సిక్స్ లింక్ అనే పర్యావరణహిత సంస్థ రిసెర్చ్ చేసి చెప్పింది. అన్ని ఉప్పు ప్యాకెట్లు, చక్కెర ప్యాకెట్లలో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయని వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం మైక్రో ప్లాస్టిక్స్ ఇన్ సాల్ట్ అండ్ షుగర్ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది.

ఆ నివేదికలో రిసెర్చ్ చేసిన ఉప్పు, చక్కెర రకాలు.. మైక్రో ప్లాస్టిక్ పరిణామాలను వివరించింది. సాధారణ ఉప్పు, రాళ్లు ఉప్పు, సముద్ర ఉప్పు, సహజ ఉప్పుతో పాటు ఐదు రకాల చక్కెరలను పరిశీలించగా.. అన్ని శాంపిళ్లలో 0.1 ఎంఎం నుంచి 5 ఎంఎం పరిమాణం కలిగిన మట్టిబెడ్డలు, ఫైబర్, ఫిల్మ్ ముక్కలు బయటపడ్డాయట. ముఖ్యంగా అయోడైజ్డ్ ఉప్పు అనుకుంటూ గొప్పగా చెప్పుకుంటాం. కానీ, ఆ ఉప్పులోనే అత్యధికంగా మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయని అధ్యయన నివేదిక స్పష్టం చేసింది. అత్యధికంగా  ఒక కిలో అయోడైజ్డ్ ఉప్పులో 89 మైక్రో ప్లాస్టిక్ ముక్కలు కనిపించాయని వివరించింది. ఆర్గానిక్ ఉప్పులోనూ మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయని నివేదిక తెలిపింది. అందులో 6-7 మైక్రోప్లాస్టిక్ ముక్కలు ఉన్నట్లు వెల్లడించింది. ఆ అవి ఫైబర్, ఫిల్మ్ ముక్కలేనని పేర్కొంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్