ఎయిడ్స్ మహమ్మారి చికిత్సలో మరో ముందడుగు పడింది. జర్మనీకి చెంది 60ఏళ్ల వ్యక్తికి ఈ చికిత్సతో ఎయిడ్స్ పూర్తిగా నయం అయ్యింది.
ప్రతీకాత్మక చిత్రం
ఎయిడ్స్ మహమ్మారి చికిత్సలో మరో ముందడుగు పడింది. జర్మనీకి చెందిన 60ఏళ్ల వ్యక్తికి ఎయిడ్స్ పూర్తిగా నయం అయ్యింది. 40ఏళ్ల ఎయిడ్స్ చరిత్రలో ఈ వ్యాధి భారీ నుంచి బయటపడ్డ ఏడోవ్యక్తి ఇతనే. బాధితుడికి చేసిన స్టెమ్ సెల్ చికిత్స విజయవంతమైనట్లు వైద్యులు ప్రకటించారు. ఇతనికి 2015లో ప్రమాదకరమైన, నొప్పితో కూడుకున్న స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంట్ చేసినట్లు వైద్యులు తెలిపారు.
హెచ్ఐవీతోపాటు మైలాయిడ్ లుకేమియా ఉన్నవారికి మాత్రమే ఈ ట్రీట్ మెంట్ చేస్తామని చెప్పారు. ఈ చికిత్స తీసుకున్నప్పటి నుంచి అతని శరీరంలో మళ్లీవైరస్ జాడలు కనిపించలేదని వైద్యులు చెప్పారు. కాగా ఎయిడ్స్ బారి నుంచి పూర్తిగా బయటపడ్డ మొదటి వ్యక్తి టిమోతి రే బ్రౌన్ కు కూడా లుకేమియా సమస్యగా ఉండేది. దీంతో 2007లో ఆయన కూడా స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్నారు. ఆ తర్వాత అతను ఈ వ్యాధి నుంచి పూర్తిగా కొలుకున్న వ్యక్తిగా నిలిచారు.