డైపర్లు వేస్తే పిల్లల ఆరోగ్యంలో మార్పులు.. తల్లిదండ్రులూ ఈ జాగ్రత్తలు తప్పనిసరి

సంవత్సరం కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు తరచుగా మూత్ర విసర్జన, మల విసర్జన చేస్తుంటారు. దాంతో ప్రస్తుతం డైపర్ల వినియోగం ఎక్కువగా పెరిగింది. పుట్టినప్పటి నుంచే డైపర్లను వాడుతున్నారు. అయితే, దాని వల్ల ఎంత ప్రమాదకరం అన్న విషయం చాలా మంది తల్లిదండ్రులకు తెలియదు.

diapers

ప్రతీకాత్మక చిత్రం

సంవత్సరం కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు తరచుగా మూత్ర విసర్జన, మల విసర్జన చేస్తుంటారు. దాంతో ప్రస్తుతం డైపర్ల వినియోగం ఎక్కువగా పెరిగింది. పుట్టినప్పటి నుంచే డైపర్లను వాడుతున్నారు. అయితే, దాని వల్ల ఎంత ప్రమాదకరం అన్న విషయం చాలా మంది తల్లిదండ్రులకు తెలియదు. డైపర్లు పిల్లల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో మీకు తెలుసా? డైపర్లను సమయానికి మార్చడం ఎంతో అవసరం. లేకపోతే, వివిధ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

పిల్లలకు డైపర్లు తప్పనిసరా?

పిల్లల కోసం క్లాత్ న్యాప్కిన్స్, డైపర్ల వాడకంపై అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిషియన్స్ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో నవజాత శిశువుల నుంచి ఒక సంవత్సరపు పిల్లలు డైపర్‌ను ఎంత వరకు ఉపయోగించవచ్చు? డైపర్‌ను ఎంతసేపు తర్వాత మార్చాలి? వంటి అంశాలను వివరించింది. ప్రస్తుత కాలంలో డైపర్ల వినియోగం విపరీతంగా పెరిగింది. అయితే, క్లాత్ న్యాప్కిన్ల వినియోగమే ఆరోగ్యకరమని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నవజాత శిశువులకు క్లాత్ న్యాప్కిన్లు కట్టడం మంచిదని చెప్తున్నారు. వీటిని ఒకసారి ఉపయోగించిన తర్వాత శుభ్రపరచి, ఎండలో ఆరబెట్టిన తర్వాత మళ్లీ వినియోగించవచ్చు.

డైపర్లు, న్యాప్కిన్లు ఎంత సమయం గడిచిన తర్వాత మార్చాలి?

నవజాత శిశువుల డైపర్లు, న్యాప్కిన్లు ప్రతి గంటకోసారి మార్చాలి. 4 నుంచి 5 నెలల పిల్లల విషయంలో క్లాత్ న్యాప్కిన్ ప్రతి 3 నుంచి 4 గంటలకోసారి మార్చాలి. అయితే డైపర్ విషయంలో ఇది చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డైపర్‌లోని జెల్ తేమను పీలుస్తుంది. డైపర్లు సింథటిక్ పాలిమర్, సెల్యులోజ్ ఫైబర్‌తో తయారవుతాయి.

డైపర్ వాడడం వల్ల ఏర్పడే సమస్యలు

ఆరోగ్య నిపుణుల వివరాల ప్రకారం, పిల్లల మూత్రం 2-3 గంటలపాటు ఎలాంటి సమస్యలు కలగనివ్వదు. కానీ మలవిసర్జన చేసినప్పుడు, డైపర్‌లోని మలం మరియు జెల్ రసాయన చర్యలు చర్మంపై ప్రభావం చూపించవచ్చు. ఈ కారణంగా, డైపర్ వాడటం వల్ల బిడ్డకు దద్దుర్లు, చర్మం వాపు, పుండ్లు ఏర్పడతాయి. పిల్లల వయస్సు లేదా నెలల ప్రకారం, రోజుకు 5-6 డైపర్లు వాడటం తప్పనిసరి, లేకపోతే క్లాత్ న్యాప్కిన్లను సరిగ్గా మార్చాలి.

బేబీ డైపర్ల వాడకం ఎక్కువగా ఉండకూడదు. పిల్లలను ఎల్లప్పుడూ గాలి, వెలుతురు వచ్చిన వాతావరణంలో ఉంచాలి. అలాగే, డైపర్ వాడకం ముందు కొబ్బరి నూనెను చర్మానికి అప్లై చేయడం ద్వారా చర్మ రక్షణ పొందవచ్చు.

ప్రస్తుతం చాలా మంది పిల్లల మూత్రం, మలాన్ని తుడవడానికి బేబీ వైప్స్ ఉపయోగిస్తున్నారు. కానీ వైప్స్ బదులుగా కాటన్ లేదా తడి గుడ్డతో తుడవడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. వైప్స్‌లో ఆల్కహాల్ కలిగి ఉండటం వల్ల, ఇది చర్మానికి హానికరంగా మారొచ్చు. అందువల్ల, మీ బిడ్డను ఎప్పుడూ కూడా గుడ్డతోనే తుడవడం మంచిది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్